లాక్డౌన్ వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దినసరి కూలీలను ఆదుకునేందుకు బాలీవుడ్ నటి వాణీ కపూర్ ముందుకొచ్చింది. వారికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు వర్చువల్ డేటింగ్ ద్వారా విరాళాలు సేకరించనుంది. ఫ్యాన్ కైండ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి చేపట్టే ఈ కార్యక్రమంలో ఐదుగురు విజేతలను ఎంపిక చేసి, వారితో డేటింగ్‌కు వెళ్లనుందీ భామ.
"కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న కూలీలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. నా వంతు బాధ్యతగా దినసరి కూలీల కుటుంబాలకు సాయం చేద్దామని నిర్ణయానికొచ్చాను. విరాళల ఇచ్చిన వారిలో ఐదుగురిని ఎంపిక చేసి, వారితో వర్చువల్ డేటింగ్‌కు వెళ్తాను. దేశవ్యాప్తంగా కూలీల కుటుంబాలకు ఆహారాన్ని అందించేందుకు నిధుల సేకరిస్తాను"
-- వాణీ కపూర్, బాలీవుడ్ నటి
ఇందులో భాగంగా వచ్చిన మొత్తంతో ఒక్కో భోజనానికి రూ.30 వెచ్చించి.. అన్నం, పప్పు, కూరగాయలు, చపాతీ మరిన్ని ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని కూలీలకు అందించనున్నారు. మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేయాలని ఫ్యాన్ కైండ్ సంస్థ భావిస్తోంది.
ఇదీ చూడండి... ''మహానటి'కి ఫిదా అయ్యా.. మీరూ చూడండి'