ETV Bharat / sitara

'వి' సినిమా వచ్చేది ఎక్కడ.. థియేటర్​? ఓటీటీ? - V CINEMA OTT RELEASE

'వి' సినిమా వచ్చేది ఓటీటీలో లేదు లేదు థియేటర్​లో అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో స్పష్టత రానుంది సమాచారం.

'వి' సినిమా వచ్చేది ఎక్కడ.. థియేటర్​? ఓటీటీ?
'వి' సినిమా
author img

By

Published : Aug 13, 2020, 1:52 PM IST

అన్నీ సిద్ధం.. ఇక విడుదలే ఆలస్యం అనుకుని.. లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన సినిమాల్లో 'వి' ఒకటి. నాని, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. ఉగాదికి విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా- లాక్‌డౌన్‌ అమలు కారణంగా వాయిదా పడింది. ఈలోగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు రావడం, వాటిని చిత్రబృందం అధికారికంగా, అనధికారికంగా ఖండించడమూ జరిగింది. అయితే ఇప్పుడు అనుకున్నదే అవుతోందట.

V CINEMA
'వి' సినిమాలో నాని-సుధీర్​బాబు

గత కొద్ది కాలంగా పెద్ద తెర మీద 'వి' అంటూ పట్టుపట్టి కూర్చున్న చిత్రబృందం ఇప్పుడు ఓటీటీవైపు చూస్తోందట. ఓటీటీ వేదికగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యక్రమాలు చివరిదశకు వచ్చాయని ఓటీటీ వర్గాల టాక్‌. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల ఐదున 'వి'ని అమెజాన్‌ ప్రైమ్‌లో చూసేయొచ్చని చెబుతున్నారు. దీని కోసం అమెజాన్‌ ప్రైమ్‌ పెద్ద మొత్తంలో ఆఫర్‌ చేసిందనీ అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండే అవకాశముంది. అయితే చర్చలు పూర్తికాలేదని దిల్‌ రాజు పీఆర్‌ టీమ్‌ తెలిపింది.

'వి' దారిలో టాలీవుడ్‌లో మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి అంటున్నారు. వాటిలో చాలా వరకు ఇటీవల కాలంలో 'ఓటీటీకి వెళ్లిపోతాయి' అంటూ వార్తలు వచ్చిన సినిమాలే ఉన్నాయని సమాచారం. థియేటర్లు తెరుచుకునే అంశంలో స్పష్టత రాకపోవడం వల్ల కొందరు నిర్మాతలు ఓటీటీ విడుదల గురించి ఆలోచిస్తున్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.