యువహీరో రాజ్ తరుణ్‌తో 'ఉయ్యాలా జంపాలా' తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని హీరోగా 'మజ్ను' టైటిల్‌తో రెండో సినిమా తీశాడు. ఇలా రెండు ప్రేమకథల్ని రూపొందించిన వర్మ.. మూడో ప్రాజెక్టు విషయమై ఆచితూచి అడుగు లేస్తున్నాడు.
'మజ్ను' తర్వాత విరామం తీసుకున్న వర్మ.. కల్యాణ్ రామ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. కల్యాణ్ రామ్‌కు ఓ కథ వినిపించాడని సినీ వర్గాల్లో టాక్. అయితే, వర్మ చెప్పిన స్టోరీ నచ్చినా.. ఇప్పటికే కొన్ని చిత్రాలకు డేట్స్ ఇవ్వడం వల్ల, కల్యాణ్‌రామ్ తర్వాత చేస్తానన్నాడని సమాచారం.
ఇదే గ్యాప్‌లో మరో చిత్రం తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట వర్మ. మెగాహీరో వరుణ్ తేజ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ పేరు కూడా వినిపిస్తోంది. వరుణ్ ఈ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోతే తరుణ్‌తో తీద్దామనుకుంటున్నాడు వర్మ. మరి ఇద్దరిలో ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెవరో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవి కూడా చదవండి:చెర్రీ తొలి సినిమా రాజమౌళి అందుకే చేయనన్నాడు..!