గతేడాది విడుదలైన 'ధక్ ధక్ ధక్' గీతం (లిరికల్ వీడియో) శ్రోతల్ని ఎంతగానో అలరించింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన 'ఉప్పెన' చిత్రంలోని పాట ఇది. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా 'ధక్ ధక్ ధక్' సాంగ్ టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.
నాయకానాయికల హావభావాలు, సముద్ర తీరం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. శరత్ సంతోష్, హరిప్రియ ఆలపించారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విభిన్న ప్రేమకథా నేపథ్యంలో రూపొందిందీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">