ETV Bharat / sitara

ఉప్పెన, చెక్, గాలి సంపత్, అక్షర అప్​డేట్స్

author img

By

Published : Feb 15, 2021, 6:22 PM IST

టాలీవుడ్​ సినిమాలకు సంబంధించిన పలు అప్​డేట్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. అందులో గాలి సంపత్, హౌస్ అరెస్ట్, చెక్, అక్షర, ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఉప్పెన చిత్రాలకు సంబంధించిన అప్​డేట్స్ ఉన్నాయి. అవేంటో మీరు చూసేయండి.

Uppena, Check, Akshara, Gali Sampath song updates
టాలీవుడ్ సాంగ్ రిలీజ్ అప్​డేట్స్

యువ నటుడు శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'గాలి సంపత్‌'. స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయనుంది చిత్రబృందం. మంగళవారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 4 గంటలకు సాంగ్​ను రిలీజ్ చేయనున్నారు నేచురల్ స్టార్ నాని.

Gaali Sampath
గాలి సంపత్

సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'హాస్ అరెస్ట్'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్​లుక్ మోషన్​ పోస్టర్ నేడు (ఫిబ్రవరి 15) విడుదలైంది. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

house arrest
హౌస్ అరెస్ట్

హీరోయిన్​ నందితా శ్వేత ప్రధానపాత్రలో నటించిన కొత్త చిత్రం 'అక్షర'. చిన్ని దర్శకత్వంలో థ్రిల్లర్​ కథాంశంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్​ను మంగళవారం (ఫిబ్రవరి 16) విడుదల చేయనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా ట్రైలర్​ను సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

Akshara
అక్షర

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చెక్'. ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఏకైక పాటను బుధవారం (ఫిబ్రవరి 27) విడుదల చేయనున్నారు.

Check
చెక్

సుశాంత్ హీరోగా దర్శణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. తాజాగా ఇందులోని 'హే మనసెందుకిలా' అనే పాటను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మంగళవారం (ఫిబ్రవరి 26) ఉదయం 11 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు.

IVNR
ఇచ్చట వాహనములు నిలుపరాదు

మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్​తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'సంద్రంలోన నీరంత కన్నీరాయేనే' అనే లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. మంగళవారం (ఫిబ్రవరి 16) ఉదయం 10 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు.

uppena
ఉప్పెన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.