కథ కంచికి చేరుతుందనగానే ఓ చిన్న మెలిక పెడతారు. శుభం కార్డు వేసేసి ముగింపు పలకకుండా.. ఈ కథ ఇంకా కొనసాగుతుందనే సంకేతమిస్తారు. అక్కడి నుంచే కొనసాగింపు చిత్రాలు శ్రీకారం చుట్టుకుంటాయి. విజయవంతమైన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తెరకెక్కడం తెలుగులో కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా ప్రయత్నాలే జరిగాయి. ఎక్కువగా ప్రతికూల ఫలితాలే ఎదురైనా.. తెలుగు చిత్రసీమకి వాటిపై మక్కువ తగ్గలేదు. కథో, వాటిలోని పాత్రలో ఆకట్టుకున్నాయంటే చాలు.. కొనసాగించడానికే ఇష్టపడుతుంటారు. ఇలా రాబోయే చిత్రాల కోసం దర్శకులు మరిన్ని కొత్త హంగులు జోడించే ప్రయత్నంలో ఉన్నారు. తొలి చిత్రంలోని పాత్రల్ని గుర్తు చేస్తూ... కొనసాగింపుల్లో కొత్త కథల్ని (ఫ్రాంచైజీ) చెప్పబోతున్నారు.
కాలాన్ని ముందుకూ వెనక్కి తిప్పి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచిన చిత్రం 'ఆదిత్య 369'. దానికి కొనసాగింపుగా 'ఆదిత్య 999' పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎప్పట్నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. దాని గురించి ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది. తొలి చిత్రాన్ని తెరకెక్కించిన సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తదుపరి చిత్రం కోసం ఇప్పటికే కథను సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. కథానాయకుడు బాలకృష్ణ కూడా ఇటీవల తన భవిష్యత్తు ప్రణాళికల్లో ఇదొకటని ప్రకటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కొత్త కొత్తగా : ఫన్.. ఫ్రస్ట్రేషన్' అంటూ 'ఎఫ్2' సినిమాను తెరకెక్కించారు అనిల్ రావిపూడి. దాన్ని ఫ్రాంచైజీగా మలచాలనేదే ఆయన ప్రయత్నం. అందుకే 'సరిలేరు నీకెవ్వరు' పూర్తవ్వగానే ఆయన 'ఎఫ్3'పై దృష్టి పెట్టారు. ఇప్పటికే కథ పూర్తి చేశారు. 'ఎఫ్3' అనగానే అందరూ 'ఎఫ్2' కథకి సీక్వెల్ అనుకుంటారు. కానీ ఇందులో కథ వేరు. తొలి సినిమాలో కనిపించిన వెంకీ, వరుణ్, హారిక, హనీ పాత్రలు, వాళ్ల కుటుంబాలు కనిపిస్తాయి కానీ... కథ మారిపోతుంది. వెంకీ, వరుణ్‌లకి ఈసారి ఫ్రస్ట్రేషన్ ఎందుకొస్తుందనేది గమ్మత్తుగా ఉంటుందంటున్నారు అనిల్ రావిపూడి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కార్తికేయ'కు కొనసాగింపుగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తొలి సినిమాలో వైద్యవిద్యార్థిగా కనిపించిన హీరో, రెండో భాగంలో వైద్యుడిగా కనిపించబోతున్నాడు. ఈసారి అతనికి ఎదురయ్యే సవాళ్లు, వీటిని ఛేదించే విధానం కొత్తగా ఉంటుందంటున్నారు దర్శకుడు చందు మొండేటి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇటీవల కథానాయకుడు నాని నిర్మించిన 'హిట్' చిత్రాన్నీ ఫ్రాంచైజీగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'హిట్ 2' కోసం కథ సిద్ధమవుతోంది. మరి రెండో సినిమాలో ఎలాంటి కేస్ ఎదురవుతుందో, దాన్ని ఎలా ఛేదిస్తాడనేది చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మంచు విష్ణు కథానాయకుడిగా 13 ఏళ్ల కిందట నటించిన 'ఢీ' సినిమాను గుర్తు చేస్తూ, 'ఢీ 2'న రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. దీని కోసం శ్రీనువైట్ల పూర్తి భిన్నమైన కథని సిద్ధం చేసినట్టు సమాచారం. తొలి సినిమాని, వాటిలోని పాత్రల్ని గుర్తు చేస్తూనే... మరింత వైవిధ్యమైన కథల్ని చెప్పడంపై దృష్టిపెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫ్రాంచైజీలుగా కాకపోయినా... రాబోయే రోజుల్లో సీక్వెల్‌గా రూపొందే చిత్రాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన 'ఇస్మార్ట్ శంకర్'కి కొనసాగింపుగా 'డబుల్ దిమాక్' చేయాలనే ఆలోచనలో ఉన్నారు. జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న 'అ!'కి కొనసాగింపు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీక్వెల్ చిత్రాలే కాదు.. ప్రీక్వెల్ కోసం కథ సిద్ధమవుతోంది. ఒక కథకి తర్వాత భాగాన్ని సీక్వెల్ అంటే, దాని ముందు భాగాన్ని ప్రీక్వెల్ అంటారు. నాగార్జున కథానాయకుడిగా నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' కథని సిద్ధం చేస్తున్నారు యువ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చూడండి : 'పెంగ్విన్' చిత్రంలో తొలిపాటను విన్నారా!