హీరో రాంచరణ్ సతీమణి ఉపానసకు అరుదైన పురస్కారం లభించింది. దాదా సాహెబ్ ఫాల్కే- ఫిలాంత్రోఫిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది మెగా కోడలు. 'నిన్ను చూసి గర్వపడుతున్నా ఉప్సీ అంటూ...' భర్త రాంచరణ్ ఆమెను ప్రశంసించాడు.
‘‘ఈ అవార్డును చాలా గౌరవంగా స్వీకరిస్తున్నాను. అలాగే నా చుట్టూ ఉండి, ప్రతిరోజూ నాలో స్ఫూర్తి నింపుతూ ముందుకు నడిపిస్తున్న వారందరికీ దీన్ని అంకితం ఇస్తున్నాను. నా వెన్నంటే ఉండి, ఎంతగానో ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..’’ -ట్విట్టర్లో ఉపాసన కొణిదెల
ఇది చదవండి: ఆ డైరక్టర్‌తో రాంచరణ్ మరో సినిమా..!