ETV Bharat / sitara

కళాకారులను ఆదుకునేందుకు 'సాహో' థీమ్​ వేలం

కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగీత కళాకారులను ఆదుకునేందుకు తమిళ మ్యూజిక్​ డైరెక్టర్​ గిబ్రాన్​ ముందుకొచ్చారు. తాను స్వరపరిచిన 'సాహో' సినిమాలోని హీరో థీమ్​ ట్రాక్​ను వేలం వేయగా వచ్చిన ఆదాయంతో వారికి సహాయం చేయడం సహా 50 శాతం మొత్తాన్ని తమిళనాడు సీఎం రిలీఫ్​ఫండ్​కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Unused Saaho Hero Theme track to be auctioned for a good cause
కళాకారులను ఆదుకునేందుకు 'సాహో' హీరో థీమ్​ వేలం
author img

By

Published : Jun 6, 2021, 1:26 PM IST

రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'సాహో' చిత్రానికి సంబంధించిన ఓ హీరో థీమ్​ స్కోర్​ను సంగీత దర్శకుడు గిబ్రాన్​ వేలం వేయనున్నారు. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం కంపోజ్​ చేసిన ఓ ట్రాక్​ చిత్రంలో ఉపయోగించలేదు. లాక్​డౌన్​ నేపథ్యంలో తన తోటి సంగీత కళాకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆ థీమ్​ స్కోర్​ను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం తమిళనాడు సీఎం రిలీఫ్​ ఫండ్​కు విరాళంగా ఇచ్చి.. మిగిలిన సొమ్మును సంగీత కళాకారులకు సాయం చేయనున్నట్లు తెలిపారు.

"సాహో' సినిమాలోని ఉపయోగించని హీరో థీమ్​(నాన్​-ఫంగబుల్​ టోకెన్​)ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ థీమ్​ ట్రాక్​ను వేలం వేయగా వచ్చిన ఆదాయంలో 50 శాతం తమిళనాడు సీఎం రిలీఫ్​ఫండ్​కు ఇవ్వగా మిగిలిన ఫండ్​ను ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న సంగీత కళాకారులకు అందించనున్నాం".

- గిబ్రాన్​, సంగీత దర్శకుడు

అయితే ఈ ట్రాక్​ను 'సాహో' దర్శకుడు సుజిత్​ తప్ప దీన్ని ఎవరూ వినలేదని గిబ్రాన్​ అన్నారు. ఈ ట్రాక్​ నచ్చినా.. దాన్ని పక్కనపెట్టారని తెలిపారు. యూవీ క్రియేషన్స్​ పతాకంపై వంశీ, ప్రమోద్​ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ శ్రద్ధా కపూర్​ నటించింది. ​

ఇదీ చూడండి: 'ఫ్యామిలీ మ్యాన్​ 2' సిరీస్​పై తమిళుల ఆగ్రహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.