ETV Bharat / sitara

ఆ వయసులోనే 'సీత'కు తారక్ లవ్​ లెటర్​! - ఆ వయసులోనే 'సీత'కు లవ్​ లెటర్​ రాసిన తారక్​!

జూనియర్​ ఎన్టీఆర్​ చిన్న వయసులోనే ప్రేమ లేఖ రాయించారట. ఆయన తెరంగేట్రం చేసిన తొలి సినిమాలో ఓ అమ్మాయిని ఉద్దేశించి లవ్​ లెటర్​ రాయించినా.. ఆ లెటర్​ను మాత్రం తనకు ఇవ్వలేదట. నేడు ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం.

Unkonwn Facts of Junior NTR personal life
ఆ వయసులోనే 'సీత'కు లవ్​ లెటర్​ రాసిన తారక్​!
author img

By

Published : May 20, 2020, 11:18 AM IST

సినీ పరిశ్రమలో నట వారసులు చాలా మంది ఉన్నారు. కానీ, తాను వారసుడిని కాదు.. తాతకు మనవడిని అంటారు. 'కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా, క్యాట్‌వాక్‌కైనా దేనికైనా అతను రెడీ'.. నూనుగు మీసాల వయసులోనే స్టార్‌డమ్‌.. బ్లాక్‌బస్టర్‌ విజయాలను ఆస్వాదించేలోపే పరాజయాలు.. తాను 'చూడడానికి కరెంట్‌ వైర్‌లా సన్నగా కనిపించినా.. టచ్‌ చేస్తే ఆ షాక్‌ మాత్రం సాలిడ్‌'గా ఉంటుంది. ఎందుకంటే ఆ పేరుకున్న పవర్‌ అలాంటిది. ఆ పేరే ఎన్టీఆర్‌.. ఇది 'శక్తి'మంతమైన పేరు... 'దమ్ము'న్న పేరు..! అందరికీ తెలిసిన పేరు.. అందరూ 'మనవాడు' అనుకున్న పేరు. డ్యాన్స్‌లు, ఫైట్స్‌, నటన, సంభాషణలు ఇలా ఏదైనా సరే ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలరు. అని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తారు. బుధవారం ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Unkonwn Facts of Junior NTR personal life
ఎన్టీఆర్​
  • ఎన్టీఆర్‌ పదో ఏట కెమెరా ముందుకు వచ్చారు. తాత పెద్ద ఎన్టీఆర్‌ నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో భరతుడి పాత్ర పోషించారు.
  • గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం'లో రాముడిగా పూర్తిస్థాయి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆ సినిమా సెట్‌లో ఎన్టీఆర్‌ చేసిన అల్లరి అంతా.. ఇంతా కాదు.
  • సీతా పరిణయం సందర్భంగా శివ ధనుర్భంగం సీన్‌ తీసేందుకు సన్నాహాలు చేస్తుంటే, రాముడి పాత్ర పోషించిన ఎన్టీఆర్‌ ముందుగానే శివ ధనస్సును విరిచేశారట.

    'రామాయణము'లో జూనియర్​ ఎన్టీఆర్​
  • రామాయణం షూటింగ్‌ జరుగుతుండగా, లక్ష్మణుడి పాత్ర చేసిన పిల్లాడు సీత పాత్ర వేసిన అమ్మాయికి లవ్‌ లెటర్‌ రాశాడు. కానీ ఇవ్వలేదు. అయితే, ఆ లెటర్‌ రాయించింది రాముడు పాత్ర వేసిన జూ.ఎన్టీఆర్‌.
  • ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు రూ.3.5లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.
  • ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా' జపనీస్‌లో డబ్‌ అయి, అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన జరిగింది. రజనీకాంత్‌ తర్వాత జపాన్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తారక్‌.

  • ఎన్టీఆర్‌ తను పనిచేసే దర్శకులను ప్రత్యేకంగా పిలుస్తారు. వి.వి.వినాయక్‌ను వినయ్‌ అన్నా, రాజమౌళిని జక్కన్న, సురేందర్‌రెడ్డిని సూరి, వంశీని కటకటలా రుద్రయ్య అని ప్రేమగా పిలుస్తారు.
  • 'చింతకాయల రవి' చిత్రంలో ఎన్టీఆర్‌ అతిథి పాత్ర పోషించారు. ఇక 'ఊపిరి' సినిమాలో నాగార్జునతో ఎన్టీఆర్‌ చేయాల్సింది. కానీ, 'నాన్నకు ప్రేమతో' సినిమా డేట్లు క్లాష్ కావడం వల్ల చేయలేకపోయారు.
  • ఈటీవీలో వచ్చిన 'భక్త మార్కండేయ', స్టార్‌ మాలో ప్రసారమైన 'బిగ్‌బాస్‌' కార్యక్రమాలతో బుల్లితెరపై మెరిశారు.
  • 'బాద్‌షా'లో తాత ఎన్‌.టి.రామారావు పేరును, 'నాన్నకు ప్రేమతో..'లో కొడుకు అభయ్‌రామ్‌ పేరు కలిసేలా అభిరామ్‌ అని తన పాత్రలకు పేరు పెట్టుకున్నారు. అంతేకాదు, 'రభస', 'యమదొంగ' సహా చాలా సినిమాల్లో అక్కడక్కడా తాత ఎన్టీఆర్‌ హావభావాలు పలికించారు.
  • 'ఆంధ్రావాలా', 'అదుర్స్‌', 'శక్తి' చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం చేశారు.
  • సినిమా అంటే హీరో డైలాగ్‌లు, పంచ్‌లతో అదిరిపోవాలి. కానీ, ఇంటర్వెల్‌ వరకూ ఎన్టీఆర్‌ మాట్లాడని సినిమా 'నరసింహుడు'.
  • రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించారు. 'స్టూడెంట్‌ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' చేశారు. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' చేస్తున్నారు.

  • ఎన్టీఆర్‌ అదృష్ట సంఖ్య 9. అందుకే ఆయన వాహనాలకు 9 నెంబర్‌ ఉంటుంది. అంతేకాదు, ట్విట్టర్‌ ఖాతా కూడా 'తారక్‌ 9999'అని ఉంటుంది.
  • ఎన్టీఆర్‌ ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ చిత్రం 'దాన వీర శూర కర్ణ'.
  • 'మాతృదేవోభవ' చిత్రంలోని 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాట అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. తరచూ ఈ పాట వింటుంటారు.
  • ఎన్టీఆర్‌కు వంట చేయడమంటే భలే ఇష్టం. వెజ్‌.. నాన్‌వెజ్‌.. రోటి పచ్చడి.. బిర్యానీ ఏదైనా వండేస్తారు.
  • రేపు ఏం జరుగుతుందనే దాని గురించి ఎన్టీఆర్‌ అస్సలు ఆలోచించరు. వర్తమానంలో బతికే మనిషి. ఎందుకంటే జీవితంపై గ్యారెంటీ లేదని అంటుంటారు. "నాకంతా తెలుసు' అనే ఆలోచనను పక్కన పెట్టి 'నాకేమీ తెలీదు' అనుకుంటే అంతా హ్యాపీనే. 'నాకుంది ఈ క్షణమే. ఆనందంగా గడిపేయాలి" అని చెబుతుంటారు.
  • అభిమానులు గొడవ పడటం ఎన్టీఆర్‌కు అస్సలు ఇష్టం ఉండదు. మొదట దేశాన్నీ, తర్వాత తల్లిదండ్రులను, భార్య బిడ్డలను చివరిగా నటులను అభిమానించాలని ఎన్టీఆర్‌ చెబుతారు.

    ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు విడుదల చేసిన కామన్​ డీపీ

ఇదీ చూడండి.. నూనూగు మీసాలోడు.. బాక్సాఫీసును కొల్లగొట్టేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.