బాలీవుడ్ నటి రియా చక్రవర్తి వ్యక్తిగతంగా గతేడాది కఠిన పరిస్థితులను ఎదుర్కొంది. యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతికి ఈమెనే కారణమని చాలామంది ఈమెపై ఆరోపణలు చేశారు. అనంతరం డ్రగ్స్ కేసులో రియాను అరెస్టు చేసిన చేసిన పోలీసులు ఆమె సోదరుడిని కూడా జైలులో పెట్టారు. అనంతరం కొన్నాళ్లకు బెయిల్‌పై ఆమె విడుదలైంది.
ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎవరూ ఆఫర్లు ఇచ్చేలా కనిపించడం లేదు. అలా చేస్తే బహుశా తమ సినిమాపై సుశాంత్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారేమో! అయితే టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్రనిర్మాతలు మాత్రం రియాను సంప్రదించినట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరనేది బయటక తెలియనప్పటికీ ఆ అంశం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది.
2012లో తెలుగులో వచ్చిన 'తూనీగ తూనీగ' సినిమాతోనే హీరోయిన్గా అరంగేట్రం చేసింది రియా. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది చదవండి: సుశాంత్ సింగ్‌తో పాటు రియా చక్రవర్తి బయోపిక్!