ఒకే కథతో.. ఒకే సమయంలో.. ఒకేసారి సినిమాలు చేయడం చాలా అరుదు. అనుకోకుండా జరగొచ్చేమో కానీ తెలిసి చేస్తే మాత్రం అది సాహసమనే చెప్పాలి. ఎందుకంటే జనాలకు రెండింటిలో ఏ సినిమాకు వెళ్లాలా? ఏది చూడాలా అని సందిగ్ధంలో పడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే టాలీవుడ్లో ఏర్పడింది. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు బయోపిక్‌లు ఏకకాలంలో రెండు తెరకెక్కుతున్నాయి.

ఇందులో ఒకటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తీస్తున్న 'స్టూవర్ట్‌పురం దొంగ' కాగా, మరోకటి రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'. బెల్లంకొండ సినిమా కొన్నాళ్ల క్రితం ప్రకటించగా, రవితేజది ఇటీవల అనౌన్స్ చేశారు. అయితే ఇది తెలిసే చేశారా? తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందా?
రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. కానీ బెల్లంకొండ 'స్టూవర్ట్‌పురం దొంగ' మాత్రం తెలుగు వరకే పరిమితం కానుంది.

ఇవీ చదవండి: