ETV Bharat / sitara

దర్శకుడితో త్రిష పెళ్లి.. త్వరలో ముహూర్తం!

సీనియర్ నటి త్రిష పెళ్లి టాపిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. ఈమె ఓ దర్శకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది.

author img

By

Published : Jul 24, 2021, 9:46 PM IST

Trisha
త్రిష

ఒకప్పుడు తెలుగులో అగ్రకథానాయికగా రాణించి ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో అలరిస్తున్న నటి త్రిష. మూడుపదుల వయసులో ఉన్న ఈ భామ త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌తో త్రిష ప్రేమలో పడిందని.. త్వరలో వీళ్లిద్దరూ తమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకోనున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పెద్దలు కూడా వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. అతి త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. ఆమె నటించిన ఓ చిత్రానికి అతనే డైరెక్టర్‌గా వ్యవహరించారని.. చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో త్రిష పెళ్లి గురించే ముచ్చటించుకుంటున్నారు.

trisha
త్రిష

ఇక.. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు కోలీవుడ్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిల్లో 'పొన్నియిన్‌ సెల్వన్‌' ఒకటి. మరోవైపు గతంలో త్రిషకి వ్యాపారవేత్త వరుణ్‌తో నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అయితే.. మనస్పర్థలు రావడంతో వారి బంధానికి మధ్యలోనే ది ఎండ్‌ కార్డ్‌ పడింది.

ఇవీ చూడండి: సోషల్ మీడియా వాకిట్లో సుందరీమణులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.