రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎనిమల్'. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'కబీర్‌సింగ్' తర్వాత హిందీలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో పరిణీతి చోప్రా ఓ నాయికగా నటిస్తోంది. ఇందులో మరో ఇద్దరు భామలకు చోటుందట. అందులో భాగంగానే బాలీవుడ్ నాయిక తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు సమాచారం.
అనుష్కశర్మ నిర్మించిన 'బుల్‌బుల్' చిత్రంలో నాయికగా ఆకట్టుకున్న తృప్తి అంతకుముందు 'లైలా మజ్ను', 'పోస్టర్‌బాయ్స్' చిత్రాల్లో నటించింది. 'ఎనిమల్' కోసం సారా అలీఖాన్‌తో పాటు పలువురినిని ఆడిషన్ చేసి వాళ్లలో తృప్తి అయితే కథకు బాగా సరిపోతుందని ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటిస్తున్న పరిణీతి చోప్రా, తృప్తిలతో రణ్‌బీర్ చేస్తున్న తొలి చిత్రమిది.