ETV Bharat / sitara

కొత్త జేమ్స్​బాండ్​ దొరికేశాడు!

జేమ్స్​బాండ్​గా ఇకపై ప్రముఖ నటుడు టామ్​ హార్డీ కనిపించనున్నారని టాక్​. బాండ్​ సిరీస్​లోని 25వ చిత్రం 'నో టైమ్​ టు డై' నవంబరులో విడుదల కానుంది.

James Bond
జేమ్స్​బాండ్
author img

By

Published : Sep 21, 2020, 7:51 PM IST

'జేమ్స్‌ బాండ్' చిత్రాలకు ఉండే క్రేజ్‌ వేరు. ఈ సిరీస్‌లోని 25వ సినిమా 'నో టైమ్​ టు డై' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటే గత నాలుగు చిత్రాల్లో బాండ్​గా డేనియల్​ క్రెగ్​ నటించి మెప్పించారు. ఇప్పుడు ఆ​ పాత్రకు గుడ్​బై చెప్పనున్నారు క్రెగ్. దీంతో తర్వాతి బాండ్​​గా ఎవరు కనిపించనున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

బ్రిటీష్‌ నటుడు‌ టామ్‌ హార్డీ తదుపరి బాండ్‌గా నటిస్తారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. 'ఇన్​సెప్షన్'​, 'ది డార్క్​ నైట్​ రైజస్'​, 'లండన్​ రోడ్​' సినిమాల్లో ఇతడు నటించారు. తర్వలోనే 'వీనమ్​ : లెట్​ థేర్​ బి కర్నేజ్​' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కరోనా వల్ల 'నో టైమ్​ టు డై' సినిమా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. పరిస్థితి సద్దుమణిగితే నవంబరులో థియేటర్​లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల ప్రకటించారు.

ఇదీ చూడండి నాలుగు భారతీయ భాషల్లో.. జేమ్స్​ బాండ్​ 'నో టైమ్​ టు డై'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.