ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్‌కు కరోనా వైరస్ సోకింది. తనతో పాటు భార్యకు పాజిటివ్‌గా తేలిందని చెప్పాడు. ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఇలా తనకు వైరస్ సోకినట్లు బహిరంగంగా చెప్పిన మొదటి హాలీవుడ్ నటుడు ఇతడే.
63 ఏళ్ల హ్యాంక్స్.. ప్రస్తుతం ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతుండగా, అతడికి జ్వరం వచ్చినట్లు అనిపించడం వల్ల వైద్య పరీక్షలు చేశారు. అందులో కరోనా వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇది చదవండి: 'హ్యారీ పోటర్' హీరో డేనియల్‌కు కరోనా?