హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ అంతరిక్షంలో సాహసాలు చేయబోతున్నారు. అందుకోసం నిజంగానే అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఆ సినిమాను అంతరిక్ష కేంద్రంలో చిత్రీకరించబోతుండటం విశేషం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందనుంది.
నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నాసా అధికారి జిమ్ బ్రిడెన్‌స్టిన్ ట్విటర్‌లో వెల్లడించారు.
"అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తెరకెక్కించే చిత్రానికి టామ్‌క్రూజ్‌తో కలసి పనిచేస్తున్నందుకు నాసా ఉత్సాహంగా ఉంది. నాసాకు ఉన్న గొప్ప ప్రణాళికలను వాస్తవాలుగా మలిచేలా కొత్త తరం ఇంజినీర్లు, శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపేందుకు మాకు జనాదరణ ఉన్న మాధ్యమం (సినిమా) అవసరం"
-బ్రిడెన్‌స్టిన్, నాసా అధికారి.
ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదీ చూడండి : అంతరిక్షంలో హాలీవుడ్ సినిమా షూటింగ్!