సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. త్వరలో కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త.. ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఇందులో మహేశ్.. స్పై అధికారిగా కనిపించనున్నాడని, చాలా రోజుల తర్వాత ఈ చిత్రం కోసం పూర్తిస్థాయిలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'భాషా' తరహాలో ఈ సినిమా కథను సిద్ధం చేశాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒకవేళ ఇదే నిజమైతే బాగుండు అని అభిమానులు అప్పుడే సంబరపడిపోతున్నారు.
తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో మహేశ్ తొలిసారి డ్యూయల్ రోల్ చేశాడు. ఆ తర్వాత 'నాని' చిత్రంలోని చివరి సన్నివేశంలో కొద్దిసేపు తండ్రి, కొడుకులుగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.
ఇదీ చదవండి: విజయ్ 'బిగిల్' టీమ్‌పై ఐటీ గురి- 65కోట్లు సీజ్