ETV Bharat / sitara

ఆ హీరోల డైరీ నిండిపోయింది.. షూటింగ్​లతో బిజీ బిజీ - రానా అరణ్య

ప్రస్తుతం పలువురు టాలీవుడ్​ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వారి గురించి ప్రత్యేక కథనం.

ఆ హీరోల డైరీ నిండిపోయింది.. షూటింగ్​లతో బిజీ బిజీ
తెలుగు హీరోలు
author img

By

Published : Mar 14, 2020, 9:16 AM IST

సినిమా తర్వాత సినిమా అనే రోజులు పోయాయి. ఇప్పుడు వేగం పెరిగింది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు రంగం సిద్ధం కావల్సిందే. లేదంటే వెనకబడిపోతాం అంటున్నారు మన హీరోలు. తప్పదనిపిస్తే తప్ప... ఒకే సినిమాతో ప్రయాణం చేయడానికి ఇప్పుడెవ్వరూ ఇష్టపడటం లేదు. యువ కథానాయకులైతే ఆ విషయంలో మరింత పక్కాగా ఉంటున్నారు. వాళ్ల కోసం విరివిగా తయారవుతున్న కథలు కూడా వాళ్లను మరింత ఉత్సాహంగా ముందడుగు వేయిస్తున్నాయి. దాంతో చాలామంది డైరీలు ఏడాది ఆరంభంలోనే నిండి పోయాయి.

హీరోయిన్ల తరహాలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయడం హీరోలకు సాధ్యమయ్యే విషయం కాదు. కథలు, అంచనాలు, సీజన్‌, విడుదల తేదీలు... ఇలా చాలా లెక్కలుంటాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగేయాల్సిందే. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా... మన హీరోలు పక్కా ప్రణాళికలతో సినిమాల్ని చేస్తున్నారు. విడుదల తేదీలు కాస్త అటూ ఇటూ అయినా... అనుకున్నట్టుగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. పోటీ వాతావరణంలో ఈ మాత్రం వేగంతో దూసుకెళ్లడం అవసరమే అనేది వాళ్ల అభిప్రాయం. అగ్ర హీరోల నుంచి, యువతరం వరకు అందరిదీ అదే పంథానే. చాలామంది కథానాయకులు ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పైన, మరొకటి స్క్రిప్ట్‌ దశలో, ఇంకో రెండు చర్చల దశలో!

మెరుపు వేగం

యువ హీరోలకు తగ్గ కథలకు కొరత ఎప్పుడూ ఉండదు. అగ్రహీరోలకు కథలు కుదరడమే కష్టమైన పని. అలాంటి పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ క్రమంగా బయట పడుతున్నట్టు స్పష్టమవుతోంది. అగ్ర కథానాయకులు.. గేరు మార్చి వేగం పెంచుతుండడమే అందుకు కారణం. పొరుగున ఆడిన కథలపై కన్నేస్తూ రీమేక్‌లకు ప్రయత్నించడం, ఇక్కడి దర్శకులతో ప్రత్యేకంగా కథలు సిద్ధం చేయించడం... ఇలా ఏదో రకంగా సినిమాల్ని మాత్రం పట్టాలెక్కిస్తున్నారు. అగ్ర హీరోల్లో ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నాడు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోపక్క మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి 'వకీల్‌సాబ్‌'. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. హిందీ హిట్ 'పింక్‌'కు రీమేక్‌ ఇది. రెండోది క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆ తర్వాత హరీశ్ శంకర్‌తో కలిసి పనిచేయనున్నాడు. 'గబ్బర్‌ సింగ్‌' తర్వాత ఆ కాంబినేషన్​లో రాబోతున్న చిత్రమిది. ఇవే కాకుండా దర్శకుడు కిశోర్‌ పార్థసాని, పవన్‌ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. రవితేజ, పవన్‌ తరహాలోనే ఓ సినిమా చేస్తూ, కొత్తగా మూడు కథల్ని ఖాయం చేశాడు.

vakeelsaab look
వకీల్​సాబ్ సినిమా ఫస్ట్​లుక్

యువ హవా

యువ హీరోల్లో నానిది ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్‌ వేగమే. ఒక్కో ఏడాదిలో మూడు సినిమాలు చేస్తుంటాడు. గత రెండేళ్లు కొంచెం వేగం తగ్గించినట్టు కనిపించిన, మళ్లీ జోరు పెంచాడు. ఈ ఏడాది నానివి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉగాదికి 'వి'తో సందడి చేయనున్న నాని, ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌' పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత 'శ్యామ్‌ సింగరాయ్‌' కోసం రంగంలోకి దిగుతాడు. ఇది డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు 'బ్రోచెవారెవరురా' దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెప్పిన కథ నానికి నచ్చిందని టాక్. యువ హీరోల్లో నితిన్‌.. నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొంచెం విరామం తీసుకుని 'భీష్మ'తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడీ హీరో. ప్రస్తుతం 'రంగ్‌దే'లో నటిస్తున్నాడు. ఇటీవలే 'అంధాధున్‌' రీమేక్‌ను ప్రారంభించాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందులో నితిన్‌ అంధుడిగా నటిస్తాడు. చంద్రశేఖర్‌ యేలేటితో ఓ చిత్రం చేస్తున్నాడు నితిన్‌. 'చెక్‌' అనే పేరుతో ప్రచారంలో ఉందీ సినిమా. కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్‌ పేట' అనే చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో మూడు విభిన్న పాత్రలు పోషించనున్నాడు.

nani in syam singa roy
శ్యామ్ సింగరాయ్​ సినిమాలో నాని

వీళ్లు ఇలా

భిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న హీరో రానా దగ్గుబాటి. ఇకపై అతడి నుంచి వరుసగా సినిమాలు రానున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన 'అరణ్య' వచ్చే నెల 2న రానుంది. ప్రభు సాల్మన్‌ దర్శకుడు. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చేస్తున్నాడు. 1990ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతోంది. ఇదివరకే ప్రకటించిన 'హిరణ్య కశ్యప'.. ఈ ఏడాదే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. సోషియో ఫాంటసీగా రూపొందే ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకుడు. వీటితోపాటు తేజ దర్శకత్వంలో 'రాక్షస రాజు రావణాసురుడు' చిత్రం చేయడానికి అంగీకారించాడు. అదీ ఈ ఏడాదే మొదలు కావొచ్చు. నాగచైతన్య డైరీ.. అస్సలు ఖాళీ లేదు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ'.. ఆ తర్వాత విక్రమ్‌ కె.కుమార్‌, నందినిరెడ్డి, పరశురామ్‌తోపాటు మరో ఇద్దరు యువ దర్శకులు చైతూ కోసం కథలు సిద్ధం చేశారు.

rana in aranya
అరణ్యలో హీరో రానా

యువతరమే కాదు, సీనియర్‌ హీరోలూ ఖాళీ లేకుండా గడుపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునల దగ్గర కథల జాబితాలు పెద్దగానే ఉన్నాయి. వాళ్లూ శరవేగంగా సినిమాలు పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.