సినిమాల్లో హీరోయిన్స్ అంటే అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అయితే కొంతమంది నటీమణులు మాత్రం హీరోలపై కన్నెర్రజేశారు. అప్పటివరకు చలాకీగా నటించే తారలు ఒక్కసారిగా విలన్లుగా మారిపోతే? విలనిజంతో మెప్పించిన స్టార్ హీరోయిన్లు ఎవరు? ఎలాంటి విలనిజాన్ని తెరపై పండించారో తెలుసుకుందాం.
రమ్యకృష్ణ
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'నరసింహ' సినిమాను తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో నీలాంబరి పాత్రలో రమకృష్ణ నటన అద్భుతం. అప్పటివరకు చిత్రసీమలో నెగెటివ్ పాత్రలో నటించి అంతగా మెప్పు పొందిన నటీమణులు ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు. నీలాంబరి పాత్రతో సినీ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు రమ్యకృష్ణ.
సౌందర్య
సినిమాల్లో మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే నటి సౌందర్య.. శ్రీకాంత్ హీరోగా నటించిన 'నా మనసిస్తారా' చిత్రంతో ప్రతినాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆ పాత్రలో సౌందర్యను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
రాశీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా రూపొందిన 'నిజం' సినిమాలో హీరో గోపీచంద్‌తో పాటు నటి రాశీ కూడా నెగెటివ్ రోల్లో నటించారు. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. కానీ, ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
రీమా సేన్
తమిళ నటుడు కార్తి హీరోగా అరంగేట్ర చిత్రం 'యుగానికి ఒక్కడు'లో నెగెటివ్ రోల్ పోషించారు నటి రీమా సేన్. దీంతో పాటు శింబు హీరోగా నటించిన 'వల్లభ' చిత్రంలోనూ ఈమె విలన్‌గా మెప్పించారు.
సమంత అక్కినేని
అప్పటివరకు గ్లామర్ పాత్రలు పోషించిన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత. తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందిన 'పత్తు ఎంద్రాకుల్లా' సినిమాతో విలన్‌గా అవతారమెత్తారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది.
త్రిష
ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన 'ధర్మయోగి' చిత్రంలో హీరోయిన్ త్రిష ప్రతినాయిక పాత్ర పోషించారు.
కాజల్ అగర్వాల్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ ప్రధానపాత్రల్లో నటిస్తూ.. తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీత'. ఇందులో కాజల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. అయితే క్లైమాక్స్‌లో ఆమె మంచి వ్యక్తిగా మారిపోతారు.
పాయల్ రాజ్‌పుత్
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ అరంగేట్ర చిత్రం 'ఆర్ఎక్స్ 100'. ఈ సినిమాలోని ఇందు పాత్రలో నటించిన పాయల్.. నెగెటివ్ రోల్లో నటించారు.
నిఖిత
అక్కినేని నాగార్జున, అనుష్క, రాఘవ లారెన్స్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం 'డాన్'. ఈ సినిమాలో లారెన్స్‌కు జోడీగా నటించిన నిఖిత.. నెగెటివ్ పాత్రలో మెప్పించారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్షీ శరత్‌కుమార్.. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న లేడీ విలన్స్‌లో ఈమెకు ఎక్కువ క్రేజ్ ఉంది. తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో ప్రతినాయిక పాత్రల్లో మెప్పించారు. 'తెనాలి రామకృష్ణ', 'క్రాక్' సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
రెజీనా కసెండ్రా
తమిళ హీరో విశాల్ నటించిన 'చక్ర' ఇటీవలే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాకు అనుకున్నంత ప్రేక్షకాదరణ దక్కకపోయినా.. ఇందులో నటనకుగానూ విశాల్, రెజీనాకు మంచి మార్కులే పడ్డాయి. విలన్‌గా రెజీనా తన పాత్రకు నూటికినూరు పాళ్లు న్యాయం చేశారు. విశాల్‌కు పోటీపడి మరి ఇందులో నటించింది. అదే విధంగా అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన 'ఎవరు' చిత్రంతో పాటు 'సెవెన్' చిత్రంలోనూ నెగటివ్ పాత్రలను పోషించారు.
ఇదీ చూడండి: బాప్రే.. ఈ నటుల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?