ETV Bharat / sitara

స్పెషల్​ సాంగ్స్​లో చిందులేసిన స్టార్​ హీరోయిన్స్​ వీరే! - sriya special songs

Tollywood Heroines in Item songs: 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ' అంటూ స్టార్​ హీరోయిన్​ సమంత అభినయించిన సాంగ్​ అభిమానుల చేత ఈలలు వేయిస్తోంది. అయితే ఇలాంటి ప్రత్యేక గీతాల్లో ప్రముఖ కథానాయికలు కాలు కదపడం కొత్తేమీ కాదు. అంతకుముందు శ్రియ, శ్రుతిహాసన్​, కాజల్​, తమన్నా లాంటి వారు కూడా ఉన్నారు. ఓ సారి వాటిపై ఓ లుక్కేద్దాం..

స్పెషల్​ సాంగ్స్​లో చిందులేసిన స్టార్​ హీరోయిన్స్​ వీరే!, Tollywood Heroines in Item songs
స్పెషల్​ సాంగ్స్​లో చిందులేసిన స్టార్​ హీరోయిన్స్​ వీరే!
author img

By

Published : Dec 12, 2021, 11:47 AM IST

Updated : Dec 12, 2021, 12:08 PM IST

Tollywood Heroines in Item songs: సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన సినిమా 'పుష్ప'. తాజాగా ఈ చిత్రంలోని 'ఊ అంటా మావ ఉఊ అంటావా మావ' అంటూ సాగే ప్రత్యేక గీతం విడుదలైంది. ఈ గీతానికి స్టార్​ హీరోయిన్​ సమంత కాలు కదిపి సినీప్రియుల చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్​ కుర్రకారులను విపరీతంగా ఊపేస్తోంది. ఎక్కడ చూసిన ఇదే వినిపిస్తోంది. సోషల్​మీడియాలోనూ ఈ పాటే ట్రెండింగ్​ అవుతోంది. అయితే సమంత కన్నా ముందే పలువురు ప్రముఖ కథానాయికలు కూడా ప్రత్యేక గీతంలో ఆడిపాడి అభిమానుల్ని అలరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గతంలో స్పెషల్​ సాంగ్స్​(ఐటెమ్​ సాంగ్స్​) కోసం కొంతమంది ప్రత్యేకంగా ఆర్టిస్ట్​లు ఉండేవాళ్లు. సిల్క్​స్మిత, జయమాలిని సహా పలువురు అలనాటి తారలు ఈ ప్రత్యేక గీతాల్లో చిందులేసేవారు. ఆ తర్వాత ముమైత్​ ఖాన్​ సహా ఇంకొంతమంది వరకు ఈ ట్రెండ్​ కొనసాగింది. అనంతరం తమ ఫేమ్​ తగ్గిన తర్వాత రాశీ, రంభలాంటి వారు స్పెషల్​ సాంగ్స్​ చేశారు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా రూట్​ మారింది. ఫామ్​లో ఉన్నప్పుడే స్టార్​ హీరోయిన్లు ఇలాంటివి చేసేందుకు ఆసక్తి చూపడం ప్రారంభించారు. బాలీవుడ్​లో కరీనాకపూర్​, కత్రినా కైఫ్​ లాంటి టాప్​ హీరోయిన్స్​తో మొదలైన ఈ కొత్త ట్రెండ్​ టాలీవుడ్​లోనూ కొనసాగింది. శ్రియ, తమన్నా, శ్రుతిహాసన్​, కాజల్​ ఇలా పలువురు భామలు తమ అందాలను మరింత హాట్​గా చూపిస్తూ ఐటెం సాంగ్స్​లో కనపడి సినీప్రియుల్ని కట్టిపడేశారు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు? ఏ పాటలకు కాలు కదిపారు? తెలుసుకుందాం..

హీరోయిన్​గా ఫామ్​లో ఉండగానే స్పెషల్​ సాంగ్స్​లో చిందులేసే ట్రెండ్​ శ్రియతోనే మొదలైందని చెప్పాలి. రామ్​ హీరోగా నటించిన దేవదాసు చిత్రంలో జామ్​ జికిడి పాటతో అలరించిందీ భామ. ఈ సాంగ్​ అప్పట్లో కుర్రోళ్లను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత 'మున్నా', 'తులసి', 'పులి' సహా పలు చిత్రాల్లో చేసింది.

మిల్కీబ్యూటీ తమన్నా.. 'జై లవకుశ', 'అల్లుడు శ్రీను', 'కేజీఎఫ్'​ చిత్రాల్లో చేసి ప్రేక్షకులకు తనలోని కొత్త కోణాన్ని చూపి ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్రుతిహాసన్​(ఆగడు), కాజల్​(జనతా గ్యారేజ్​)​, పూజాహెగ్డే(రంగస్థలం) ప్రత్యేక గీతాల్లో నర్తించి అలరించారు.

ఇంకా కొంతమంది ఫేమ్​ తగ్గుతుంది అన్న సమయంలో సెకండ్​ ఇన్నింగ్స్​గా ఈ స్పెషల్​ సాంగ్స్​లో కనపడి అభిమానుల్ని రంజింపచేశారు. వారిలో లక్ష్మీరాయ్​(ఖైదీ 150, బలుపు, గబ్బర్​సింగ్​ 2), హంసనందిని(రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది), హంసిక, తాప్సీ, ప్రియమణి(చెన్నై ఎక్స్​ప్రెస్​), చార్మి(ఢమరుకం), అంజలి, సదా, శ్వేతాబసు ఇంకా పలువురు హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు.

ఇదీ చూడండి: 'ఊ అంటావా మావ.. '.. ఫిదా చేస్తున్న సామ్​ హాట్​లుక్స్​​

Last Updated : Dec 12, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.