ETV Bharat / sitara

గెటప్ మారుతోంది.. అంచనాలు పెరుగుతున్నాయ్! - రవితేజ కొత్త లుక్

కథలు డిమాండ్‌ చేశాయంటే.. వేషధారణలపై మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు మన హీరోలు. కొన్నిసార్లు ఒకే సినిమాలో రెండు మూడు కోణాల్లో కనిపించాల్సి వస్తుంటుంది. అందుకోసం కథానాయకులు ప్రత్యేకమైన కసరత్తులు కూడా చేసి, పాత్రలకి తగ్గట్టుగా సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల్లో కొత్త లుక్​లు ట్రై చేస్తోన్న హీరోలు ఎవరో చూద్దాం.

Tollywood
టాలీవుడ్
author img

By

Published : May 25, 2021, 7:31 AM IST

కొత్త సినిమా కబురు వినిపిస్తే చాలు.. ఆయా తారల అభిమానులు, సినీ ప్రేమికులు ప్రత్యేకమైన ఆత్రుతతో ఆరా తీస్తుంటారు. దర్శకుడు ఎవరు? జోడీగా ఎవరు నటిస్తారు? కథా నేపథ్యం ఏమిటి? ఎప్పుడు విడుదలవుతుంది?.. ఇలా ప్రతిదీ ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందులో తమ అభిమాన తారలు భిన్నమైన గెటప్పుల్లోనూ కనిపిస్తారనే సంగతి వినిపించిందంటే.. ఆత్రుత మరింతగా పెరిగిపోతుంది. లుక్‌ ఎలా ఉంటుంది? ఒకటా.. రెండా? రెండు కోణాల్లో కనిపిస్తారని తెలిశాక ఒక లుక్‌ బయటికొచ్చినా సరే.. కనిపించని మరొక ఆ అవతారం ఎలా ఉంటుందో అంటూ ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు కూడా అదే తరహాలో గెటప్పుల ఊసులతో ఊరిస్తున్నారు మన హీరోలు.

ఎప్పటికప్పుడు కొత్త రకమైన వేషధారణలతో కనిపించడం కథానాయకులకి కొత్తేమీ కాదు. కథల మాటెలా ఉన్నా.. కనిపించే విధానంలోనైనా కొత్తదనం చూపించాలనేది వాళ్ల తాపత్రయం. అందుకే అప్పుడప్పుడు ఇతర పరిశ్రమలకి చెందిన మేకప్‌ నిపుణుల్ని కూడా ఆహ్వానించి కొత్త లుక్‌లు ప్రయత్నిస్తుంటారు. ఇక కథలు కూడా డిమాండ్‌ చేశాయంటే.. వేషధారణలపై మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. కొన్నిసార్లు ఒకే సినిమాలో రెండు మూడు కోణాల్లో కనిపించాల్సి వస్తుంటుంది. అందుకోసం కథానాయకులు ప్రత్యేకమైన కసరత్తులు కూడా చేసి, పాత్రలకి తగ్గట్టుగా సిద్ధమవుతుంటారు.

గుండుతో చిరంజీవి

గతేడాది చిరంజీవి గుండుతో ఓ గెటప్‌ని ప్రయత్నించి చూసుకున్నారు. అది 'వేదాళం' రీమేక్‌ కోసమే. అప్పట్నుంచి ఆయన గుండు బాస్‌గా ఎలా సందడి చేస్తారా అంటూ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

chiru
చిరంజీవి

పవన్‌కల్యాణ్‌ మూడు లుక్స్

'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్‌కల్యాణ్ గెటప్ గురించి బయటికొస్తున్న విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పవన్ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. మొఘల్‌ కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ మూడు రకాల లుక్స్‌లో కనిపిస్తారని సమాచారం. అందుకోసం కథానాయకుడు పవన్‌కల్యాణ్, ఇతర చిత్రబృందం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారు.

pawan kalyan
పవన్ కల్యాణ్

రెండు కోణాల్లో ప్రభాస్

ప్రభాస్‌ 'సలార్‌'లోనూ రెండు కోణాల్లో కనిపిస్తారని సమాచారం. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్‌'లోని గ్యాంగ్‌స్టర్‌ లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. దానికి భిన్నమైన మరో లుక్‌ కూడా సినిమాలో ఉంటుందని, ఆ లుక్‌లోనే ఆయన సిక్స్‌ ప్యాక్‌ దేహంతో సందడి చేస్తారని సమాచారం. ఆ మేరకు ప్రభాస్‌ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలిసింది.

prabhas
ప్రభాస్

బాలయ్య 'అఖండ' రూపం

నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ'లోనూ రెండు రకాల గెటప్పులతో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఆ రెండు లుక్కులూ బయటికొచ్చాయి. బోయపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

balayya
బాలయ్య

వెంకీ 'నారప్ప' అవతారం

విక్టరీ వెంకటేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'నారప్ప'లోనూ రెండు రకాల వేషధారణలతో కనిపిస్తారు. ఆ మేరకు ఆయన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణని పూర్తి చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళంలో హిట్ అందుకున్న 'అసురన్'​కు రీమేక్.

venkatesh
వెంకటేష్

నాని కొత్త లుక్

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'శ్యామ్‌ సింగరాయ్‌'లో ఆయన గెటప్పు ఆకట్టుకుంది. బెంగాలీ బాబుగా నాని కనిపిస్తున్న విధానమే కొత్తదనాన్ని పంచింది. అలాగే ఆయన తెరపై మరికొన్ని గెటప్పుల్లో కనిపిస్తారని తెలుస్తోంది. మరి వేషాలు ఎలా ఉంటాయో చూడాలి.

nani
నాని

చైతూ మూడు కోణాల్లో

'థ్యాంక్యూ' సినిమా కోసం నాగచైతన్య కూడా మరోసారి తన లుక్‌ని మార్చుకున్నాడు. ఆయన కూడా ఇందులో మూడు రకాలుగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. యువకుడిగానూ, అలాగే మూడు పదుల వయసు దాటిన వ్యక్తిగానూ ఆయన తెరపై సందడి చేయనున్నారని సమాచారం.

naga chaitanya
నాగ చైతన్య, రాశీ ఖన్నా

నితిన్​ది అదే బాట

'పవర్‌ పేట' అనే సినిమా కోసం నితిన్‌ కూడా కొత్త గెటప్పులు ప్రయత్నించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన మూడు పాత్రల్లో కనిపిస్తుండగా, అందులో ఆరు పదుల వయసున్న వ్యక్తి పాత్ర ఒకటి కావడం విశేషం. కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

రవితేజ 'ఖిలాడి' రూపం

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'ఖిలాడి'. అయితే ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక దానికొకటి భిన్నమైనవి. ఆ లుక్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

raviteja
రవితేజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.