ETV Bharat / sitara

సీఈఓ కథల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్

author img

By

Published : Feb 22, 2020, 6:46 AM IST

Updated : Mar 2, 2020, 3:38 AM IST

ఇటీవలే కాలంలో టాలీవుడ్​లో వస్తున్న సినిమాలు సీఈఓ కథల ఆధారంగానే తీస్తున్నారు. ఈ ఫార్ములాతో కొందరు దర్శకులు హిట్​లు కొట్టగా, మరికొందరు చతికిలపడ్డారు. వీటి గురించే ఈ ప్రత్యేక కథనం.

సీఈఓ కథల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్
టాలీవుడ్ సినిమాలు

ఓపెన్ చేస్తే హీరో ఓ సాధారణ వ్యక్తి.. కట్ చేస్తే ఇంటర్వెల్​లో కంపెనీకి సీఈఓ అవుతాడు. ఆ పదవిని దక్కించుకోవాలని చూస్తున్న విలన్​ను క్లైమాక్స్​లో మట్టికరిపిస్తాడు. కథను సుఖాంతం చేస్తాడు.... గత కొంతకాలంగా స్టార్ హీరోలు నటిస్తున్న జానర్ ఇది. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్​లో ఉంది. ఇటీవలే కాలంలో అలాంటి కథలతో వచ్చిన సినిమాలేంటి? వాటి సంగతేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పవన్​కల్యాణ్ 'అజ్ఞాతవాసి'

కంపెనీకి సంబంధం లేని వ్యక్తిగా, సాధారణ ఉద్యోగిగా అందులో చేరిన హీరో పాత్రధారి పవన్.. తన కుటుంబానికి చెందిన అదే సంస్థకు సీఈఓగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. ఇందులో ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. 2018 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చింది.

pawan kalyan agnathavaasi
పవన్​కల్యాణ్ 'అజ్ఞాతవాసి'

మహేశ్​బాబు 'మహర్షి'

ఈ కథలో సూపర్​స్టార్ మహేశ్​బాబు.. కంపెనీకి సీఈఓ కావడమే ధ్యేయంగా తన చదువు పూర్తి చేస్తాడు. అనుకున్నట్లే తన లక్ష్యాన్ని సాధిస్తాడు. కానీ ఆ తర్వాత వ్యవసాయంపై మక్కువ పెంచుకొని, సాధారణ రైతుగానూ ఇందులో కనిపిస్తాడు. గతేడాది వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ అద్భుత వసూళ్లు సాధించింది.

mahesh maharshi
మహేశ్​బాబు మహర్షి

ప్రభాస్ 'సాహో'

డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన 'సాహో' ఇలాంటి జానర్​లో తెరకెక్కించారు. ఓ దొంగ, దొంగతనంగా పోలీస్ అవతారమెత్తి.. చివరకు తన తండ్రి స్థాపించిన సంస్థకు వారసుడిగా, సీఈఓగా ఎలా మారడనేది ఈ సినిమా కథ. గత ఆగస్టులో వచ్చిన ఈ చిత్రం భారీ వ్యయంతో తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తే, సుజీత్ దర్శకత్వం వహించాడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది.

prabhas in saaho
ప్రభాస్ సాహో

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'

సీఈఓ కథాంశంతో తీసిన జానర్​లోనే తెరకెక్కిందీ సినిమా. చిన్నప్పుడే జరిగిన ఓ పనివల్ల తన కుటుంబానికి దూరమైన అల్లు అర్జున్ పాత్ర.. నిజం తెలుసుకొని, తనవారికి ఎలా దగ్గరయ్యాడు. తండ్రి పెట్టిన కంపెనీకి ఎలా సీఈఓ అయ్యాడో ఈ చిత్రంలో చూడొచ్చు. ఇటీవలే సంక్రాంతికి వచ్చిన సినిమా.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల 'నాన్ బాహబలి' రికార్డులు నెలకొల్పింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. తమన్ అందించిన పాటలు ఇప్పుటికీ మార్మోగుతూనే ఉన్నాయి.

allu arjun ala vaikunthapurramuloo
'అల వైకుంఠపురములో' సినిమాాలో అల్లు అర్జున్

నితిన్ 'భీష్మ'

నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ 'భీష్మ'నూ ఇలాంటి కథతోనే తీశారు. డిగ్రీ కూడా పాసవ్వని సాధారణ యువకుడు.. ఓ ఎరువుల కంపెనీకి సీఈఓగా ఎలా మారాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. రష్మిక హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు.

nithiin beeshma

Last Updated : Mar 2, 2020, 3:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.