ETV Bharat / sitara

టాలీవుడ్.. ఇచ్చట అన్ని రకాల కథలు దొరుకును!

కొన్నేళ్ల కిందట కమర్షియల్ హంగులతో ఫైట్లు, పాటలకే పరిమితమైన టాలీవుడ్.. ప్రస్తుతం సరికొత్త పంథాలో ముందుకు సాగుతోంది. అగ్రహీరోలు కూడా కొత్త రకమైన కథలకు మొగ్గుచూపుతున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమవుతున్నారు.

tollywood
టాలీవుడ్
author img

By

Published : Apr 11, 2021, 9:21 AM IST

"ప్రేక్షకులు చూస్తారా?.. అయినా ఇలాంటి కథలు ఇదివరకెప్పుడైనా వచ్చాయా? ఆడాయా? ఇంత పెట్టుబడి పెట్టి తీయాలంటే.. రిస్కేమో?"

కొన్నేళ్ల కిందట కొత్త కథ అనగానే ఇలాంటి సందేహాలే వ్యక్తమయ్యేవి. ఫార్ములా సినిమాల మధ్య ఒకటీ అరా.. ఆడీ ఆడక అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సదరు కొత్త కథలపై ఎవరికీ సదాభిప్రాయం ఉండేది కాదు. అందుకే అందరూ హిట్‌ ఫార్ములాని నమ్ముకొని ఆ కోవలో ప్రయాణం చేసేవారు. ఒక్కో సినిమా చూస్తున్నప్పుడు వాటిపై అంతకుముందే వచ్చిపోయిన ఓ ఆరేడు సినిమాల ప్రభావం కనిపించేది. ప్రేక్షకులు ఇవే చూస్తున్నారు కాబట్టి, మేం ఇవే తీస్తున్నామని దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చేవారు. కొత్త కథలు ఎక్కడ నుంచి వస్తాయని హీరోలూ వారిని అనుసరించేవారు. ఇప్పుడు సన్నివేశం మారింది. కొత్తదనమే అసలైన ఫార్ములా అయ్యింది. విషయం ఉందని నమ్మితే చాలు.. సాహసాలకి సై అంటున్నారు. కథానాయకులు లెక్కల్ని పక్కనపెట్టేసి వాటికోసం ఎంత సమయమైనా కేటాయిస్తున్నారు. అందుకే గుర్తుండిపోయే సినిమాలొస్తున్నాయి. ప్రస్తుతం కథానాయకులు ఎంపిక చేసుకున్న కథల తీరుతెన్నుల్ని గమనిస్తే.. ఎంత వైవిధ్యం కనిపిస్తుందో!

కొన్నేళ్లుగా ప్రేక్షకుల అభిరుచుల్లో గొప్ప మార్పులు వచ్చాయి. వాస్తవికత, కొత్తదనం ఉన్న కథలకి పట్టం కడుతున్నారు. అది గమనించి అడుగులు వేస్తోంది చిత్రసీమ. ఇన్నాళ్లూ చేసిన కథలే చేస్తూ వచ్చిన కథానాయకులు ఇప్పుడు మరింత ఉత్సాహంతో కొత్త నేపథ్యాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందుకోసం సాహసాలు చేస్తున్నారు.

కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఒకటి పీరియాడిక్‌ కథ. మరొకటి పురాణ గాథ, మరొకటేమో యాక్షన్‌ థ్రిల్లర్‌. 'రాధేశ్యామ్‌', 'ఆదిపురుష్‌', 'సలార్‌'.. ఇలా వరుసగా ప్రతి సినిమాలోనూ ఓ కొత్త రకమైన ప్రభాస్‌ని చూడొచ్చన్నమాట. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రం ఓ సరికొత్త నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇదివరకు అగ్రకథానాయకుడి సినిమా అంటే ఆరు పాటలు, ఆరు ఫైట్లు అనే లెక్కలతోనే మొదలయ్యేది. ఇప్పుడు కథ తర్వాతే మిగతా విషయాలు.

prabhas
ప్రభాస్

యువ కథానాయకుడు నాని ప్రస్తుతం ఓ పీరియాడిక్‌ కథలో నటిస్తున్నారు. అదే.. 'శ్యామ్‌ సింగరాయ్‌'. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని మూడు కోణాల్లో కనిపిస్తారని సమాచారం.

పవన్‌కల్యాణ్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా కథతో ఇటీవలే 'వకీల్‌సాబ్‌' చేశారు. కొత్త నేపథ్యంతో కూడిన ఆ కథలో పవన్‌ విశ్వరూపం ప్రదర్శించారు. పవన్‌ కల్యాణ్‌ కొత్త చిత్రాలూ భిన్నంగా సాగనున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' మొఘలాయిలు, కుతుబ్‌ షాహీ శకం నేపథ్యంలో సాగే కథ. ఇందులో పవన్‌ బందిపోటుగా జానపద హీరోలా కనిపిస్తున్నారు. 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌లోనూ ఆయన ఓ కొత్త రకమైన పాత్రని చేస్తున్నారు.

pawan kalyan
పవన్ కల్యాణ్

యువ కథానాయకుడు రానా దగ్గుబాటి చిత్రం 'విరాటపర్వం' అటవీ నేపథ్యంలోనే సాగుతుంది. ఇటీవల ఆయన సుకుమార్‌ శిష్యుడైన వెంకీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు తెలిసింది. అదొక పీరియాడిక్‌ డ్రామాగా, మొఘలాయిల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్టు సమాచారం.

స్టైలిష్‌ పాత్రలతో కనిపించే అల్లు అర్జున్‌ ఈసారి సుకుమార్‌తో కలిసి అడవిబాట పట్టాడు. 'ఆర్య', 'ఆర్య2' తర్వాత ఆ ఇద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప'. ఇది ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ. ప్రచార చిత్రాలు చూశాక ఈ చిత్రంతో ఓ కొత్త అల్లు అర్జున్‌ని, ఓ కొత్త కథని చూడనున్నామని స్పష్టమవుతోంది. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది.

Allu arjun
అల్లు అర్జున్

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ యువ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయనున్నారు. అదొక స్పోర్ట్స్‌ డ్రామాతో కూడిన కథ అని, ఎన్టీఆర్‌ స్పోర్ట్స్‌మెన్‌గా కనిపిస్తారని సమాచారం.

"ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. కథానాయకుడు తెరపై ఇలాగే కనిపించాలనే నియమాలేవీ పెట్టుకోకుండా కథల్ని ఆస్వాదిస్తున్నారు. వాస్తవికతని ఇష్టపడేవాళ్ల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టే కథలు తయారవుతున్నాయి. ఇది మంచి పరిణామం. మరిన్ని మంచి కథలు, కొత్త నేపథ్యాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందిఠ అని నిర్మాత డి.సురేష్‌బాబు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.