ETV Bharat / sitara

యూట్యూబ్​ స్టార్​​ ప్రేమలో పడిన పాయల్​ - Saurabh Dhingra

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్ పాయల్‌ రాజ్‌పుత్‌ తన ప్రేమను నెటిజన్లకు చెప్పేసింది. గతంలో చాలా సార్లు తన ప్రియుడితో ఫొటోలు పెట్టిన ఈ అమ్మడు.. తాజాగా కాస్త జోష్​ పెంచి ఇద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలను షేర్​ చేసింది.

Tollywood Actress Payal Rajput dating with Saurabh Dhingra?
యూట్యూబ్​ స్టార్​​తో ప్రేమలో పడిన పాయల్​
author img

By

Published : Feb 13, 2020, 12:00 PM IST

Updated : Mar 1, 2020, 4:55 AM IST

నటి పాయల్​ రాజ్‌పుత్ కెరీర్..​ మూడు పాటలు, ఆరు సినిమాల్లా సాగిపోతోంది. వృత్తిపరంగా జోష్​ మీదున్న ఈ అమ్మడు.. తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన ప్రియమైన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పంచుకుంటూ.. ఓ విషయాన్ని తెలియజేసింది.

Tollywood Actress Payal Rajput dating with Saurabh Dhingra?
సౌరభ్​తో పొటోలు షేర్​ చేసిన పాయల్​

"నాలోని మంచీ చెడులను ప్రేమించే ఒకే ఒక వ్యకివి నువ్వు. నీకంటే ఎవ్వరూ నాకు ప్రియమైన వారు కాదు. నీతో గడిపిన సమయం నాకు ఓ మధుర జ్ఞాపకం. నా జీవితంలోకి ఎంతో ఆనందం తీసుకొచ్చావు. హ్యాపీ బర్త్​డే మై జాన్.​"

-- పాయల్​ రాజ్​పుత్, నటి

పాయల్​తో ఉన్న వ్యక్తి పేరు సౌరభ్​గా తెలుస్తోంది. పలు పంజాబీ ధారావాహికల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఒకర్నొకరు ఇష్టపడినట్లు సమాచారం.

సౌరభ్​, పాయల్​

ఇటీవల వెంకటేశ్​తో 'వెంకీమామ', రవితేజతో 'డిస్కోరాజా' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది పాయల్. ప్రస్తుతం ప్రణదీప్​ అనే దర్శకుడితో ఓ నాయికా ప్రాధాన్య సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళంలో 'ఏంజెల్'​ అనే సినిమాతో తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్​ నుంచి అవకాశాలు వస్తున్నట్లు ఇటీవలె పాయల్​ వెల్లడించింది.

Last Updated : Mar 1, 2020, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.