ETV Bharat / sitara

యాక్టింగ్​లోనే కాదు బిజినెస్​లోనూ హీరోలే! - సందీప్​ కిషన్​ వివాహభోజనంబు

టాలీవుడ్ హీరోలు ఓవైపు భారీ చిత్రాలతో అలరిస్తూనే తమకు సంబంధించిన వ్యాపారాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొంతమంది నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తుండగా.. మరికొంత మంది ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్రసీమలో ఆ హీరోలు ఎవరో, వారు చేస్తున్న వ్యాపారాలేమిటో తెలుసుకుందాం.

Tollywood Actors Who Are Also Successful Entrepreneurs
యాక్టింగ్​లోనే కాదు బిజినెస్​లోనూ హీరోలే!
author img

By

Published : Apr 29, 2021, 9:32 AM IST

సినిమాల్లో నటించడమే కాకుండా రకరకాల వ్యాపారాల్లోనూ రాణిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు కొంతమంది టాలీవుడ్​ హీరోలు. అటు నటనతో పాటు బిజినెస్​లోనూ దండిగా ఆర్జిస్తున్నారు. మెగాస్టార్​ చిరంజీవి దగ్గర్నుంచి యువ హీరో సందీప్​ కిషన్​ వరకు ఎంతోమంది అనేక వ్యాపారాల్లో అడుగుపెట్టి లాభాలను గడిస్తున్నారు. ఈ క్రమంలో ఆ హీరోలు ఎవరు? వారు చేసే బిజినెస్​ ఏమిటో తెలుసుకుందామా.

మహేశ్​ బాబు

Tollywood Actors Who Are Also Successful Entrepreneurs
మహేశ్​బాబు

హీరోలుగా చిత్రసీమలో సినిమాలు చేస్తూ బిజినెస్​మ్యాన్​గా రాణించిన వారి జాబితాలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు అగ్రస్థానంలో ఉంటారు. చిత్రాల నిర్మాణరంగంలో అడుగుపెట్టడం సహా ఇటీవలే హైదరాబాద్​లో ఏఎమ్​బీ మల్టీప్లెక్స్​ను నడుపుతున్నారు. వీటికి తోడు ఓ దుస్తుల బ్రాండ్​తో పాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ విషయంలో ఆయన సతీమణి నమ్రత కూడా మహేశ్​కు సాయంగా ఉంటోంది.

చిరంజీవి

చిత్రసీమలో అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి నటనపై దృష్టి పెట్టిన మెగాస్టార్​ చిరంజీవి.. ప్రస్తుతం వ్యాపారం వైపు మొగ్గు చూపారు. దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​తో కలిసి ఇండియన్​ సూపర్​లీగ్​లో కేరళ బ్లాస్టర్స్​ టీమ్​కు సహ యజమానిగా ఉన్నారు.

రామ్​చరణ్​

నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​.. వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. టాలీవుడ్​లో పలు చిత్రాలను నిర్మించడం సహా ఓ విమాన సంస్థలో భాగమయ్యారు. వీటితో పాటు పోలో అనే క్రీడలోనూ అడుగుపెట్టినట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

అక్కినేని నాగార్జున

చిత్రసీమలో హీరోగా, నిర్మాతగానూ రాణిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఇంతకుముందు ఓ ప్రైవేట్​ ఛానెల్​లో కొన్నేళ్లపాటు భాగస్వామిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన ఓ రేసింగ్​ కంపెనీతో పాటు ఇండియన్​ సూపర్​లీగ్​లోని ఓ ఫుట్​బాల్​ టీమ్​కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.

అల్లు అర్జున్

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్ కూడా ఒకవైపు నటిస్తూ.. మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. హైదరాబాద్​లో బన్నీ ఓ పబ్​ను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు అమీర్​పేట్​లోని సత్యం థియేటర్​ స్థానంలో 'ఏఏఏ' మల్టీప్లెక్స్​ నిర్మాణంలో భాగమయ్యారు.

విజయ్​ దేవరకొండ

'అర్జున్​రెడ్డి' చిత్రంతో స్టార్​డమ్​ అందుకున్న నటుడు విజయ్​ దేవరకొండ.. ఆ తర్వాత రౌడీ అనే దుస్తుల బ్రాండ్​ను ప్రారంభించారు. ఇప్పుడు మల్టీప్లెక్స్​ రంగంలోకి అడుగుపెట్టారు. విజయ్​ సొంతూరైన మహబూబ్​నగర్​లో ఏషియన్​ ఫిల్మ్స్​తో కలిసి ఓ మల్టీప్లెక్స్​ను నిర్మిస్తున్నారు.

సందీప్​ కిషన్​

యువ కథానాయకుడు సందీప్​ కిషన్​ నటనతోపాటు సినీ నిర్మాణంలోనూ అడుగుపెట్టారు. వీటితో పాటు వివాహభోజనంబు అనే రెస్టారెంట్​నూ నడుపుతున్నారు.

నితిన్​

హీరో నితిన్​కు అటు యాక్టింగ్​తో పాటు నిర్మాణరంగంలోనూ పట్టు ఉంది. అక్కినేని అఖిల్​ అరంగేట్ర చిత్రానికి ఈయనే నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చూడండి.. 'హరిహర వీరమల్లు' విడుదలపై నిర్మాత క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.