కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత తెలుగు నటుల్లో జోరుగా ముందుకు సాగుతున్నారు కింగ్ నాగార్జున. అగ్రనటుల్లో అందరికంటే ముందు కెమెరా ముందుకొచ్చిందీ ఆయనే. ఇటీవలే హిమాలయాల్లో 'వైల్డ్‌డాగ్' షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ముంబయిలో జరుగుతున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రీకరణలో భాగస్వాములయ్యారు.
ఈ షెడ్యూల్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనీరాయ్‌తో కలిసి ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను వీరి మీద చిత్రీకరిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
ఇదీ చూడండి:'ఉప్పెన' సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేశ్