ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. '1947' అని టైటిల్ కూడా ఖరారు చేశారట. మరో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఓం ప్రకాశ్ భట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని.. త్వరలోనే నటీనటుల వివరాలతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని కోలీవుడ్ వర్గాల్లో టాక్.
2011లో ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన మురగదాస్.. 'ఎంగేయుమ్ ఎప్పోథుమ్', 'వాత్తికుచి', 'రాజా రాణి', 'మాన్ కరాటి' వంటి పలు చిత్రాలను నిర్మించారు. చివరిసారిగా రజనీకాంత్‌తో 'దర్బార్' సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే 'ది లయన్ కింగ్' వంటి ఓ పూర్తిస్థాయి యానిమేటెడ్ సినిమాను తెరకెక్కించనున్నారని వినికిడి.
ఇదీ చూడండి: ఒక్క బయోపిక్ కోసం ఇద్దరు స్టార్ డైరెక్టర్లు!