ETV Bharat / sitara

టైగర్​ తొలి ఆల్బమ్ పాట​కు 'అన్​బిలీవబుల్' స్పందన​ - అన్​బిలీవబుల్​ సాంగ్​ రిలీజ్​

'అన్​బిలీవబుల్'​ గీతానికి వస్తున్న ఆదరణపై చాలా సంతోషం వ్యక్తం చేశారు హీరో టైగర్​ఫ్రాఫ్. అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Tiger Shroff
టైగర్​ ష్రాఫ్​
author img

By

Published : Sep 27, 2020, 5:00 PM IST

'హీరోపంతి'తో బాలీవుడ్​లోకి అడుగుపెట్టిన టైగర్​ష్రాఫ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు, డ్యాన్స్​, ఫైట్స్​తో అభిమానులను ఫిదా చేశారు. ఈ మధ్యే 'అన్​బిలీవబుల్'​ వీడియో సాంగ్​తో గాయకుడిగానూ తన ప్రతిభ చూపించారు. విడుదలైన 24 గంటల్లోనే అన్ని మాధ్యమాల్లో కలిపి 140 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన టైగర్.. తనను ఎంతో ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.

" కొత్తదనాన్ని స్వాగతించి, ప్రేక్షకులు ఎంతో ప్రేమ కురిపించడం నిజంగా 'అన్​బిలీవబుల్'​. నేను ఎప్పటికీ కోరుకునేది ఇదే. ఈ ప్రయత్నానికి అద్భుత ప్రతిఫలం దొరికినట్లు అనిపించింది. ప్రజల్లో దాగున్న ప్రతిభను వెలికితీయడానికి వారిని ప్రోత్సహించేందుకు నేను చిన్న ప్రయత్నం చేశాను"

టైగర్​ ష్రాఫ్​, సినీ నటుడు

'అన్​బిలీవబుల్'​ గీతం​ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు ఘనతలు సాధించింది. ఇన్​స్టా​లో 20 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకోగా.. ట్విట్టర్​లో 64 మిలియన్ల వ్యూస్​కు చేరుకుంది. మరోవైపు విడుదలైన రోజు యూట్యూబ్​ ట్రెండింగ్​లో నాలుగో స్థానంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.