2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'కు కొనసాగింపుగా వస్తున్న 'టైగర్ 3' షూటింగ్ విదేశాల్లో జరగనుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్‌లతో పాటు సినిమా బృందం రష్యాకు తరలివెళ్లనుంది. గతంలో కరోనా విజృంభణ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆగస్టు 18న రష్యా వెళ్లనున్న ఈ యూనిట్.. 45 రోజుల పాటు విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. సల్మాన్, కత్రినాలపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. రష్యాతో పాటు ఆస్ట్రియా, టర్కీ సహా మరో 5 అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరణను జరపనున్నారు. ఇదివరకెన్నడూ చూడని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని చిత్రబృందం పేర్కొంది.
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన స్పై థ్రిల్లర్ సినిమాలో మూడో భాగంగా 'టైగర్ 3' తెరకెక్కుతోంది. దీనికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్‌లో మొదటగా 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగం 'టైగర్ జిందా హై' 2017లో విడుదలైంది. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: