బాలీవుడ్ హిట్ పెయిర్లో సంజయ్‌దత్-మాధురీ దీక్షిత్(Sanjay Dutt-MadhuriDixit) జంట ఒకటి. ఇద్దరూ కలిసి 'సాజన్', 'ఖల్ నాయక్' వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అనేక కథనాలు వచ్చాయి.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్.. ఈ విషయం గురించి స్పందిస్తూ.. మాధురీకి ఓ సందర్భంలో క్షమాపణలు కూడా చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. "సాజన్ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు మాధురీకి సారీ చెప్పాను. ఆమె తప్పు లేకుండానే ప్రజలు తన గురించి మరోలా మాట్లాడుకునేవారు. అయినా తను ఇవేమీ పట్టించుకోకుండా క్షమాపణలు చెప్పగానే స్వీకరించింది" అని అన్నాడు.
సంజయ్-మాధురీ.. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో 2019లో విడుదలైన 'కలంక్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సంజయ్.. 'కేజీఏఫ్ 2', 'షంషేరా' సినిమాల్లో నటిస్తుండగా.. మాధురీ ఓ డ్యాన్స్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.
ఇదీ చూడండి: భార్యకు సంజయ్ దత్ అత్యంత ఖరీదైన బహుమతి