ETV Bharat / sitara

నాన్నను చూసి మూడు వారాలైంది: సల్మాన్​ఖాన్ - కొవిడ్ 19 వార్తలు

లాక్​డౌన్​లో తనకెదురైన అనుభవాలను చెప్పాడు కథానాయకుడు సల్మాన్​ఖాన్. తన తండ్రిని చూసి మూడు వారాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

నాన్నను చూసి మూడు వారాలైంది: సల్మాన్​ఖాన్
తండ్రితో సల్మాన్​ఖాన్
author img

By

Published : Apr 6, 2020, 6:19 PM IST

ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనలు గురిచేస్తోంది. ఈ మహమ్మారి తీవ్రత మన దేశంలోనూ పెరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం లాక్​డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కుటుంబంతో కాకుండా వేరోచోట చిక్కుకుపోయారు. ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు హీరో సల్మాన్​ఖాన్. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను ట్విట్టర్​లో వీడియోగా పంచుకున్నాడు.

''జో డర్‌ గయా సమ్‌ జో మర్‌గయా' అనే సినిమా డైలాగులు ప్రస్తుతం పనికిరావు. పరిస్థితులను చూస్తుంటే నాకెంతో భయంగా ఉంది. నేను, నా సోదరుడి కుమారుడు నిర్వాన్‌ గతకొన్ని రోజుల నుంచి మా కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. మా నాన్నను చూసి మూడు వారాలైంది. నిజం చెప్పాలంటే మేం చాలా భయపడుతున్నాం. అలాగే భయపడుతున్నామనే విషయాన్ని ధైర్యంగా చెబుతున్నాం. ఎవరైతే భయపడతారో నిజంగా వాళ్లు సురక్షితంగా ఉన్నట్లు. ఇప్పటికైనా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను' -వీడియోలో హీరో సల్మాన్​ఖాన్

ప్రస్తుతం భారత్​లో ఈ వైరస్​.. 4067 మందికి సోకగా, 109 మంది మృతి చెందారు. 292 మంది దీని నుంచి కోలుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.