బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో 'జబర్దస్త్'. ఇందులో గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు హాస్యనటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శీను హీరోలుగా మారారు. ప్రస్తుతం 'త్రీ మంకీస్' అనే సినిమాలో ప్రధాన పాత్రల్లోనటిస్తున్నారు. ఆదివారం ఫస్ట్‌లుక్ విడుదలైంది.
ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఎవరు కనిపించనున్నారనే విషయం తెలియాల్సి ఉంది. అనిల్ కుమార్ సంగీతమందిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై జి.నాగేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇది చదవండి: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. 'సైరా' వస్తున్నాడు