ETV Bharat / sitara

అనుష్క-నవీన్​ పొలిశెట్టి సినిమా కథ ఇదే! - Anushka-Naveen polishetty

హీరోయిన్​ అనుష్క-యువ నటుడు నవీన్​ పొలిశెట్టి కలిసి ఓ సినిమా చేయనున్నారంటూ కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

Anushka-Naveen polishetty cinema
అనుష్క-నవీన్​ పొలిశెట్టి సినిమా
author img

By

Published : Mar 23, 2021, 10:08 PM IST

రమేశ్​ దర్శకత్వంలో హీరోయిన్​ అనుష్క-యువ నటుడు నవీన్​ పొలిశెట్టి ఓ సినిమా చేయనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​లో ఈ చిత్రం రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

రొమాంటిక్​ ప్రేమ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందట. 40ఏళ్ల మహిళ పాత్రలో అనుష్క, 20ఏళ్ల కుర్రాడిలా నవీన్​ కనిపించనున్నాడని సమాచారం. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిణామాలు ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని తెలిసింది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: 'అరణ్య' హిందీ వెర్షన్​ విడుదల వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.