ETV Bharat / sitara

'డ్రగ్​చాట్​ ఆధారంగా రియాపై సీబీఐ చర్యలు తీసుకోవాలి' - రియా డ్రగ్​చాట్​పై సుశాంత్ సోదరి శ్వేతాసింగ్​ కీర్తి ఆరోపణ

సుశాంత్​ మృతి వెనుక నటి రియా నేరపూరిత కుట్ర ఉందని హీరో సోదరి శ్వేతాసింగ్​ కీర్తి ఆరోపించింది. రియా చక్రవర్తి డ్రగ్​ చాట్​ ఆధారంగా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​లో సీబీఐని కోరింది శ్వేత.

This is criminal offence: SSR's sister wants CBI action against Rhea over alleged drug chat
'డ్రగ్​చాట్​ ఆధారంగా రియాపై సీబీఐ చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Aug 26, 2020, 5:00 PM IST

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి డ్రగ్​ చాట్​ ఆధారంగా ఆమెపై నేరపూరిత ఆరోపణలు చేసింది దివంగత నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ సోదరి శ్వేతాసింగ్​ కీర్తి. ఆ చాటింగ్​ ఆధారంగా రియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​లో సీబీఐని కోరింది శ్వేత.

"ఇది చట్టరీత్య నేరం. దీనిపై సీబీఐ వెంటనే చర్యలు తీసుకోవాలి. #రియాడ్రగ్స్​చాట్​" అని శ్వేతాసింగ్​ కీర్తి ట్వీట్​ చేసింది.

This is criminal offence: SSR's sister wants CBI action against Rhea over alleged drug chat
సుశాంత్​సింగ్​ సోదరి శ్వేతా సింగ్​ కీర్తి ట్వీట్​

"సుశాంత్​కు తెలియకుండానే అతని వెనుక ఏదో కుట్ర జరిగింది. చివరికి అది అతని మరణానికి దారితీసింది" అని సుశాంత్​సింగ్​ కుటుంబం తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై నటి రియా తరఫు న్యాయవాది స్పందించారు.

"రియా ఇప్పటివరకు ఎలాంటి డ్రగ్స్​ ఉపయోగించలేదు. ఈ విషయంలో రియా ఎలాంటి వైద్యపరీక్షకైనా సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు.

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​.. జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

ఐదోసారి విచారణకు

సుశాంత్​ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతవారం నుంచి ఈ కేసుల పూర్వపరాలను తెలుసుకొని దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ బృందం. సుశాంత్​ స్నేహితుడైన సిద్ధార్థ్​ పితానీని గత మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. గతేడాది నుంచి హీరో మరణించిన వరకు జరిగిన వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో పితానీని ఐదవసారి విచారణకు పిలిచారు.

విచారణకు మాజీ మేనేజర్​

సుశాంత్​​ మృతి కేసులో మనీలాండరింగ్​కు సంబంధించి అతని మాజీ మేనేజర్​ జయ సాహాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) బుధవారం విచారణకు పిలిచింది. సాహాను ఇదివరకే ప్రశ్నించిన ఈడీ.. మళ్లీ హాజరుకావాలని కోరినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం క్వాన్​ టాలెంట్​ ఏజెన్సీలో కన్సల్టెంట్​గా పనిచేస్తున్న జయ సాహా.. గతంలో సుశాంత్​, రియాలకు మేనేజర్​గా వ్యవహిరించింది. మాదకద్రవ్యాల కోణంలో సాహాను ప్రశ్నించనున్నారని ఈడీకి చెందిన ఓ అధికారి తెలిపారు. రియా, సాహాలకు సంబంధించిన ఓ ఆడియో లీక్​ అవ్వడం వల్ల జయ సాహాను విచారణకు పిలిపించారని తెలుస్తోంది.

మాదకద్రవ్యాల కోణంలో విచారణ

డ్రగ్స్​ కోణంలో విచారణ చేయడానికి ఈడీ.. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ) సహాయాన్ని కోరింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం రియాకు సంబంధించిన వాట్సాప్​ చాటింగ్​, మాదకద్రవ్యాలు గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం మనీలాండరింగ్​ అంశంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటి రియాకు సంబంధించిన ఫోన్లు, ఎలక్ట్రానిక్​ పరికరాలను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించిన తర్వాత డ్రగ్స్​ కోణంలో విచారణ జరుగుతుందని.. దీనికి సంబంధించిన ఆధారాలను సీబీఐ, ఎన్​సీబీలతో పంచుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.