'వకీల్‌సాబ్' చిత్రంలోని ద్వితీయార్ధంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్ ఉందని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ అన్నారు. ఊహించని విధంగా అందరూ ఆశ్చర్యానికి గురవుతారని తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకానున్న.. నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.
ఇదీ చూడండి: అల్లు అర్జున్ 'ఐకాన్'కు త్వరలోనే ముహూర్తం!