ప్రస్తుతం తారక్.. త్రివిక్రమ్‌తో చేయనున్న కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం తారక్ నుంచి ముచ్చటగా మూడో చిత్రం చూసే అవకాశమూ ఉంది. తమిళ దర్శకుడు వెట్రి మారన్‌తో తారక్ ఓ సినిమా చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
'వడ చెన్నై', 'అసురన్' వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ ఎన్టీఆర్ కోసం ఓ చక్కటి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని, ఇప్పటికే ఈ విషయమై తారక్‌తో ఓ దశ చర్చలు కూడా జరిపాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లోనే చిత్రాన్ని పట్టాలెక్కించి వచ్చే ఏడాది ద్వితియార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట.
త్రివిక్రమ్ చిత్రం ఆలస్యమైతే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సినిమా పట్టాలెక్కనుంది. మరి వెట్రి మారన్‌కు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
ఇదీ చదవండి: మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి సందడి..!