ETV Bharat / sitara

గాయని కనికా కపూర్​కు ఎట్టకేలకు కరోనా నెగిటివ్

గాయని కనికా కపూర్​కు ఆరోసారి చేసిన వైద్యపరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

kanika-kapoor-came-negative
గాయని కనికా కపూర్
author img

By

Published : Apr 6, 2020, 10:30 AM IST

బాలీవుడ్​ గాయని కనికా కపూర్​కు ఎట్టకేలకు కరోనా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం లఖ్​నవూలోని సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స తీసుకుంటోంది. తాజాగా ఆరోసారి జరిపిన వైద్య పరీక్షల్లో ఆమెకు నెగిటివ్​గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని రోజులపాటు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి పలు టెస్టులు చేసిన అనంతరం డిశ్చార్జ్ చేయనున్నారు.

గత నెల 9న లండన్​ వచ్చిన కనికా.. ఉత్తరప్రదేశ్​లోని హోటల్​లో బస చేసింది. ఆ తర్వాత పలు పార్టీలకు హాజరై.. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను కలిసింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆమెకు కరోనా సోకినట్లు తేలడం సంచలనమైంది. దీంతో ఈమెను కలిసిన వారు క్వారంటైన్​లోకి వెళ్లారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించకుండా, కరోనా వచ్చినా పార్టీలకు వెళ్లినందుకు పోలీసులు కనికాపై కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: ''ఆర్ఆర్ఆర్' విడుదలలో వాయిదా లేదు.. అనుకున్న సమయానికే వస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.