ETV Bharat / sitara

తన ఇంటి ద్వారాలనే విరగ్గొట్టిన 'ది రాక్'​

​ విద్యుత్​ అంతరాయంతో ఇంటి ద్వారాలు తెరుచుకోకపోవడం వల్ల డ్వేన్ జాన్సన్ ఆ గేట్​ను విరగ్గొట్టాల్సి వచ్చింది. తన కోసం సినిమా సిబ్బంది ఎదురుచూస్తున్నారని అందుకే తానే స్వయంగా గేటును పెకిలించాలని తెలిపాడు రాక్.

Rock
రాక్​
author img

By

Published : Sep 19, 2020, 3:51 PM IST

Updated : Sep 20, 2020, 6:13 AM IST

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్​గా కెరీర్​ ప్రారంభించి, హాలీవుడ్​లో ఆకట్టుకుంటున్న ప్రముఖ నటుడు డ్వేన్​ జాన్సన్​.. ఏకంగా తన ఇంటి ద్వారాలనే విరగ్గొట్టాడు. విద్యుత్​ అంతరాయం వల్ల అవి తెరుచుకోలేదు. దీంతో తన కోసం ప్రొడక్షన్ సిబ్బంది ఎదురుచూస్తున్నారని, తనే స్వయంగా ఆ గేటును పెకలించుకుని షూటింగ్​కు వెళ్లారు. ఈ విషయాన్ని ఇన్​స్టా​ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

"బహుశా ఈ రోజు నాకు మంచి రోజు కాదేమో. తుఫాను కారణంగా విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. దీంతో మా ఇంటి గేట్ తెరుచుకోలేదు. ద్వారాలను తెరిచేందుకు హైడ్రాలిక్​ వ్యవస్థను ఉపయోగించి చూశా కానీ కుదరలేదు. వెంటనే కొంతమందికి ఫోన్​ చేసి గేటును ఎంత త్వరగా ఓపెన్​ చేయొచ్చే అడిగి తెలుసుకున్నా. సుమారు 45 నిమిషాలు పడుతుందని చెప్పారు. కానీ, నా కోసం చాలా మంది ప్రొడక్షన్​ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. అందుకే గేటును పూర్తిగా నెట్టి, లాగి, పెకలించేశాను"

డ్వేన్​ జాన్సన్​, హాలీవుడ్​ నటుడు

"ఇటుక గోడ నుంచి పూర్తిగా తీసేసి.. ఉక్కు హైడ్రాలిక్​ను విడదీసి గేటును గడ్డిపై విసిరా. నా భద్రత సిబ్బంది ఓ గంట తర్వాత టెక్నీషియన్లను పిలిపించారు. వారు దీన్ని చూసి భయపడ్డారు. అసలు ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు" అని డ్వేన్ పేర్కొన్నారు.

Last Updated : Sep 20, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.