ETV Bharat / sitara

'ఆదిపురుష్'లో ప్రభాస్‌కు జోడీగా కృతి ఫిక్స్‌ - ప్రభాస్‌

ఓంరౌత్​ దర్శకత్వంలో ప్రభాస్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్​'. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. సీత పాత్రలో కృతిసనన్​ నటించనుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

The film crew has officially announced that Krithisanan will be acting in the movie Adipurush.
ఆదిపురుష్​ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఈమె ఫిక్స్‌
author img

By

Published : Mar 12, 2021, 9:13 AM IST

రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్న చిత్రం 'ఆదిపురుష్‌'. ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజుల నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌ పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు.. 'ఆదిపురుష్‌'లో ప్రభాస్‌కు జంటగా సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తున్నారని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే, బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌.. లక్ష్మణుడిగా నటించనున్నారు.

The film crew has officially announced that Krithisanan will be acting in the movie Adipurush.
ప్రభాస్​తో కృతిసనన్

చిత్రబృందంతో ప్రభాస్​, కృతిసనన్

'ఆదిపురుష్‌' టీమ్‌లోకి కృతిసనన్‌, సన్నీసింగ్‌లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం చిత్రబృందం కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో ప్రభాస్‌, కృతిసనన్‌, సన్నీసింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న 'ఆదిపురుష్‌'లో బీటౌన్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్ర పోషించనున్నారు.

ఇదీ చదవండి: రామ్​చరణ్​తో మరోసారి జతకట్టనున్న కియారా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.