ETV Bharat / sitara

రికార్డు ధరకు 'కేజీఎఫ్ 2​' డిజిటల్​ హక్కులు - KGF chapter 2 OTT rate

కన్నడ నటుడు యశ్​ హీరోగా, ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్​'.. దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది. మొదటి భాగం బ్లాక్​బాస్టర్​ విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ క్రేజ్​ నెలకొంది. ఈ క్రమంలో 'కేజీఎఫ్​ ఛాప్టర్​ 2'కు సంబంధించిన డిజిటల్​ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్​ ప్రైమ్​ కొనుగోలు చేసింది.

That's huge! KGF: Chapter 2 digital rights sold for Rs 55 cr
రికార్డు ధరతో 'కేజీఎఫ్ 2​' డిజిటల్​ హక్కులను కొనుగోలు
author img

By

Published : May 11, 2020, 12:28 PM IST

'బాహుబలి' తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన పాన్​ఇండియా చిత్రం 'కేజీఎఫ్​'. ఈ చిత్ర రెండో భాగానికి సంబంధించిన డిజిటల్​ హక్కులను తాజాగా అమెజాన్​ ప్రైమ్ రూ.55 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఆన్​లైన్​ హక్కులను సొంతం చేసుకుంది. ​ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిజిటల్​ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్​.. రెండో భాగాన్నీ సొంతం చేసుకోవడం విశేషం.

That's huge! KGF: Chapter 2 digital rights sold for Rs 55 cr
'కేజీఎఫ్​ 2' ఫస్ట్​లుక్​

దర్శకుడి కోసం స్టార్​ హీరోలు

ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్​'లో కన్నడ హీరో యశ్​ ప్రధానపాత్రలో నటించాడు. ఈ చిత్రం 2018లో విడుదలై బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయం సాధించడం సహా యశ్​కు స్టార్​డమ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు ప్రశాంత్​ నీల్​కూ దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్​తో ఎన్టీఆర్​, మహేశ్​బాబు, ప్రభాస్​ వంటి స్టార్​హీరోలు అతని దర్శకత్వంలో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. 'కేజీఎఫ్​' రెండో భాగంలో బాలీవుడ్​ స్టార్లు సంజయ్​ దత్​, రవీనా టాండన్​లు నటిస్తున్నారు. ​

ఇదీ చూడండి.. 'నాని చెప్పిందే జరుగుతుందని ఊహించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.