అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్' (Thank You Brother). రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న 'ఆహా' (Aha) వేదికగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మేకింగ్ విడుదలైంది.
లిఫ్ట్‌లో అనసూయ (Anasuya), విరాజ్‌ల మధ్య జరిగే కీలక సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో ఇందులో చూడొచ్చు. ఈ చిత్రంలో అనసూయ గర్భవతి పాత్ర పోషించింది. ఈ పాత్రకోసం చిత్రబృందం ఎంత కష్టపడిందో ఈ వీడియో తెలియజేస్తుంది.
ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, అన్నపూర్ణ, వైవా హర్ష, కాదంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">