కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(vijay) అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన కథానాయకుడిగా త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్(tollywood)లో పేరు పొందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని వంశీ ఇటీవల వెల్లడించారు.
'విజయ్‌తో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. విభిన్నమైన కథ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్‌డౌన్(Lockdown) పూర్తయిన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నెమ్మదిగా వెల్లడిస్తాం' అని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు విజయ్‌కు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పనిచేస్తున్నారు. అది పూర్తి అయిన వెంటనే ఆయన వంశీ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి: