టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ 'తలా' ఎంఎస్.ధోనీ.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ను (Dhoni Vijay) కలిశాడు. యాడ్ షూటింగ్ కోసం మహి అక్కడికెళ్లగా.. గోకులం స్టూడియోస్‌లో విజయ్ చిత్రం 'బీస్ట్' షూటింగ్ (Beast Vijay) జరుగుతోంది.
విజయ్ తన కారవన్లో ధోనీతో మాట్లాడిన అనంతరం మర్యాద పూర్వకంగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సెలబ్రిటీలు ఒకేచోట కలవడం వల్ల అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.


సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో దశ ప్రాక్టీస్ కోసం ధోనీ ఇప్పటికే చెన్నై చేరుకున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడే సమయానికి సీఎస్కే జట్టు 7 మ్యాచ్‌లాడింది. వాటిలో ఐదింట్లో గెలిచిన ధోనీ సేన 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: MS Dhoni: చెపాక్ చేరిన సీఎస్కే సింహం.. ప్రాక్టీస్ కోసమే