*మెగాహీరో వరుణ్‌తేజ్ కొత్త సినిమా 'గని'(ghani movie varun tej). ఈ సినిమాలోని తొలిపాట 'గని ఏంథమ్'ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్, బాక్సర్‌గా కనిపించనున్నారు. డిసెంబరు 3న సినిమా థియేటర్లలోకి రానుంది. 'వరుడు కావలెను'(varudu kaavalenu release date) చిత్రంలోని 'వడ్డానం' వీడియో సాంగ్‌ను కూడా బుధవారం విడుదల చేశారు. అక్టోబరు 29న ఈ సినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*సునీల్ శెట్టి తనయుడు అహన్‌శెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా 'తడప్'(tadap trailer). 'ఆర్ఎక్స్ 100' రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. తారా సుతారియా(tara sutaria movies) హీరోయిన్. మిలాన్ లుథ్రియా దర్శకుడు. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. డిసెంబరు 3న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*కేసీఆర్(kcr movie) జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. శ్రీకాంత్ టైటిల్ రోల్లో నటించారు. నవంబరు 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. వడత్యా హరీశ్ దర్శకత్వం వహించారు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్.. మూలకథ అందించడం సహా నిర్మాతగా వ్యవహరించారు.
*రాజ్‌కుమార్ రావ్, భూమి పెడ్నేకర్(bhumi pednekar movie) హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రకటించారు. 'బీద్' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకుడు. నవంబరు నుంచి షూటింగ్ మొదలుకానుందని అధికారికంగా వెల్లడించారు.
ఇవీ చదవండి: