తెలుగు దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు శుక్రవారం వస్తుండగా.. కోదాడ సమీపంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో నాగేశ్వరరావును ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చెప్పిన మరో డైరెక్టర్ వీరశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తన స్నేహితుడు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1986 నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాగేశ్వరరావు.. కెరీర్ ప్రారంభంలో కోడి రామకృష్ణ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. కృష్ణంరాజు, జయసుధ నటించిన 'రిక్షా రుద్రయ్య' సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' సినిమా చేశారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి లాంటి చిత్రాలు వచ్చాయి. నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్లను పరిచయం చేసింది ఈయనే.
తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫిట్స్ రావడం, సడెన్గా మరణించడంపై పలువురు నటీనటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: