అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'లగాన్'(Lagaan). బ్రిటీష్ పన్నుల నుంచి ఓ గ్రామం ఎలా విముక్తి పొందిందనే కథతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫారెన్ మూవీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ లభించింది. ఆస్కార్ బరిలో గట్టిపోటీనిచ్చి భారతీయ చిత్రాల సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. దేశ సినీ చరిత్రలోనే చారిత్రక చిత్రంగా మిగిలిపోయిన లగాన్ విడుదలై.. నేటితో 20ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. ఆనాటి రోజులను, చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోనుంది. 'ఛలే ఛలో లగాన్: వన్స్ అపాన్ యాన్ ఇమ్పాజిబుల్ డ్రీమ్' పేరుతో భారత నెట్‌ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో స్ట్రీమింగ్ చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నిర్మాతగా
లగాన్‌తో ఆమిర్‌ఖాన్ పేరు మారుమోగిపోయింది. దీనితో పాటు చిత్రంతో ఆమిర్‌ఖాన్ నిర్మాతగానూ మారారు. ఎక్కడా రాజీపడకుండా ఆయన ఈ సినిమాను రూపొందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్.. ఈ చిత్రాన్ని రూపొందించే విషయమై తన మాజీ భార్య రీనా ఎంతో సహకరించిందని ప్రశంసించారు. ఈ సినిమా కోసం కష్టపడిన రచయితలు, నటీనటులు సహా ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని వెల్లడించారు.
ఇదీ కథ
ఈ చిత్రంలో భువన్ పాత్ర పోషించారు ఆమిర్ ఖాన్. ఆ రోజుల్లో బ్రిటీష్ వారు అన్యాయంగా విధించే పన్నును కట్టలేమని ఓ గ్రామప్రజలు తమ ప్రాంతపు రాజుకు విన్నవించుకుంటారు. అయితే సదరు రాజు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో ఆంగ్లేయులు ఆ ఊరి ప్రజలను హేళన చేస్తారు. అదే సందర్భంలో క్రికెట్ ఆడుతూ సరదాగా గడుపుతున్న అక్కడి బ్రిటీష్ అధికారి మాటలు ఆ గ్రామానికి చెందిన భువన్ను కోపానికి గురి చేస్తాయి. సత్తా ఉంటే క్రికెట్లో తమను ఓడిస్తే, తాము ఆ ఊరు వదిలి వెళ్తామని ఆ అధికారి సవాల్ చేస్తాడు. ఆ సవాల్‌ను స్వీకరించిన భువన్ తన కుటుంబాన్ని, గ్రామాన్ని విముక్తి చేయడానికి క్రికెట్లో వారిని ఓడిస్తానని శపథం చేస్తాడు. ఓ క్రికెట్ జట్టును తయారుచేస్తాడు. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఆ ఆటలో చివరి బంతికి సిక్స్ కొట్టి ఆమిర్ జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇక బ్రిటిషర్లు ఆ గ్రామాన్ని వీడకతప్పలేదు.
విశేషాలు
ఈ సినిమాకు అమితాబ్‌బచ్చన్ వాయిస్ ఓవర్,. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రాణం పోశాయి. పాటలు విశేషంగా అలరించాయి. అందరూ ప్రశంసల వర్షం కురిపించారు.