ETV Bharat / sitara

'2 గంటల పాటు నన్నే చూడాలి.. వేరే దారి లేదు' - ప్రేక్షకులు

తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ పన్ను. బాలీవుడ్​లో ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తోన్న ఈ అందాల భామ.. 'గేమ్ ఓవర్' అనే సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. జూన్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియాతో  పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

తాప్సీ పన్ను
author img

By

Published : Jun 11, 2019, 12:40 PM IST

Updated : Jun 11, 2019, 1:00 PM IST

తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'తో కుర్రాళ్ల మనసుల్ని కట్టిపడేసింది... తరువాత వరుసగా అగ్ర కథానాయకులతో నటించి మెప్పించింది... ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీ బిజీగా మారిన నటి 'తాప్సీ పన్ను'. ఇప్పుడు మరోసారి 'గేమ్ ఓవర్' అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విషయాలతో పాటు మరికొన్ని విశేషాలు తాప్సీ మాటల్లోనే... ​

ప్ర: గేమ్​ ఓవర్​ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం?

జ: మొట్టమొదటి సారి భారతీయ సినిమాలో ఇలాంటి కథ నేను విన్నాను. అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సినిమా ఇది. నా పాత్రతో పాటు కథ, కథనం కూడా నాకు బాగా నచ్చాయి. ఇది ఒక ప్రాంతీయ సినిమాలా ఉండదు. ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల అవ్వాలి అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్ర: ఈ సినిమాలో చక్రాల కుర్చీలో కూర్చొని నటించారు కదా ఎలా ఉంది..?

జ: అవునండీ.. నా జీవితంలో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు.. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్ లో కూర్చోవడం.. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవం లేదు.

ప్ర: చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

జ: షూటింగ్ లో చాలా భాగం నేను వీల్ ఛైర్ లోనే ఉంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా డిమాండ్ ఉన్న రోల్ ఇది. ప్రమాదం జరిగిన ఒక సంవత్సరానికి.. మళ్లీ యానివర్సిరీ రియాక్షన్ మొదలయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే పాత్ర. ఆ యాక్సిడెంట్ ఏంటో మీరు సినిమాలో చూడాల్సిందే.

ప్ర: ఏ భాషలో అయినా సినిమాను మీ భుజాలపై వేసుకుంటున్నారు.. ఎలా మోస్తున్నారు? అది ఆత్మవిశ్వాసం అనుకోవచ్చా..?

జ: (నవ్వుతూ) నిజానికి వేరే దారి దొరకలేదు. ఇలాంటి కథలే దొరికాయి కాబట్టి.. నేనే నా భుజాలపై మోయాల్సి వస్తుంది. నాకూ ఈ కథలు నచ్చాయి. మా దర్శకులు కూడా చాలా తెలివైనవాళ్లు.. వాళ్లే నాకు హీరోలు.

ప్ర: మీరు నిజ జీవితంలో వీడియో గేమ్స్ ఆడతారా?

జ: ఆడేదాన్ని.. స్కూల్, కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు మేరియో, బ్యాట్​మ్యాన్, కాంట్రా ఆడేదాన్ని.. ఆ తరువాత ఆడలేదు.

ప్ర: 'బద్లా' సినిమా 100 కోట్లు పైగా వసూలు చేసింది.. మీరు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారని అనుకోవడంలేదా?

జ: అవును.. నా నుండి మంచి సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకోవాలనుకుంటాను. అంచనాలు లేకుంటే కిక్ ఏముంటుంది. 100 కోట్లు వసూలు చేస్తుందా? అంటే ఏం చెప్తాం. నా సినిమా అంత వసూలు చేయాలని ప్రయత్నిస్తా.. కానీ 'బద్లా' పెద్ద సర్​ప్రైజ్ అందరికీ.. ఇంత కలెక్ట్ చేస్తుందని అనుకోలేదు.

ప్ర: ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ కదా.. ఒక్క పాత్రతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించడం లేదా?

జ: ఒక యాక్టర్​కు ఇది నిజంగా పరీక్ష లాంటిది. 2 గంటల పాటు నన్నే చూడాలి ఈ సినిమాలో మీరు.. మీకు వేరే దారి లేదు. ఇది నాకూ టెస్ట్ లాంటిదే.

తాప్సీ పన్ను
తాప్సీ పన్ను

ప్ర: ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు ఏంటి..?

జ: తమిళ్​లో ఒక సినిమా ఫైనల్ అయింది. 'గేమ్ ఓవర్' విడుదలయ్యాక ఆ సినిమా ప్రారంభం అవుతుంది. తెలుగులో రెండు మూడు కథలు విన్నా ఇంకా తేల్చుకోలేదు. కానీ సంవత్సరానికి ఒక సినిమా మాత్రం పక్కా తీస్తా.

ప్ర: పెళ్లి చేసుకునే ప్లాన్స్ ఇప్పుడేమైనా ఉన్నాయా?

జ: ఇప్పుడైతే లేవండి.. ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను.

Mumbai, Jun 10 (ANI): Fire broke out in Mumbai's Goregaon industrial area on Monday. 4 fire tenders were present at the spot. Further details are awaited.
Last Updated : Jun 11, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.