తమిళనాట హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిని ఇళయదళపతి అని ముద్దుగా పిలుచుకుంటారు. తమ అభిమాన కథానాయకుడి సినిమా వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడీ హీరో. శనివారం అతడి పుట్టినరోజు సందర్భంగా విజయ్ 63వ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు 'బిజిల్' అనే టైటిల్ ఖరారు చేశారు.
విజయ్-అట్లీ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన తెరి (పోలీసోడు), మెర్సెల్ (అదిరింది) కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించాయి. ఇప్పుడీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఫుట్‌బాల్ కోచ్‌గా, వయసు మళ్లిన వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడీ హీరో.
రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ చిత్రం. నయనతార హీరోయిన్. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది చదవండి: తలపతి విజయ్ కోసం 'స్టేడియం' కట్టేశారు!