వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మిల్కీ తమన్నా (Tamannaah) బ్యూటీ ఇప్పుడు డిజిటల్ మీడియాలోనూ మెరుస్తోంది. తాజాగా ఆమె నటించిన 'నవంబర్ స్టోరీ' (November Story) ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె స్టార్ల సంస్కృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"సినిమా, ఓటీటీ ఈ రెండింటిలో వచ్చే అవకాశాలను ఒకేలా చూస్తా. డిజిటల్ మీడియా పుంజుకోవడం వల్ల తారల ప్రాధాన్యం క్రమంగా తగ్గి కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. పదేళ్ల క్రితం ప్రేక్షకులకి ఇప్పటి తరానికి చాలా తేడా ఉంది. కొవిడ్, లాక్‌డౌన్ కారణంగా వారి అభిరుచులతో పాటు, సినిమాను చూసే కోణంలోనూ మార్పులొచ్చాయి. స్టార్ అనే దృష్టికోణం క్రమంగా మారుతూ వస్తోంది. సినిమాలోని తారలు, వారి ప్రతిభనే చూడకుండా.. అందులోని కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు" అని అంటోంది తమన్నా.
'లెవంత్ అవర్'తో తొలిసారి ఓటీటీల్లోకి అడుగుపెట్టిన తమన్నా.. ప్రస్తుతం సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం'లో నటిస్తోంది. అలాగే 'అంధాదూన్' తెలుగు రీమేక్‌లో నితిన్‌తో కలిసి నటిస్తోంది. హిందీలో టబు పోషించిన పాత్రను ఇక్కడ తమన్నా పోషిస్తోంది. అలాగే గోపిచంద్ 'సీటిమార్'లో కబడ్డీ కోచ్‌గా కనిపించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">