లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమైన తెలుగు సినీ కార్మికులకు తలసాని ట్రస్ట్ ఆసరాగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో 14 వేల మంది కార్మిక కుటుంబాల కడుపు నింపేందుకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా క్రైసిస్ కమిటీ సభ్యులు ఎన్.శంకర్, సి.కల్యాణ్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కథానాయకుడు నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, రాధాకృష్ణ, అభిషేక్ అగర్వాల్, ఎఫ్డీసీ మాజీ ఛైర్మన్ రాంమోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై సినీకార్మిక సంఘాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. తలసాని ట్రస్ట్ నిర్వాహకులతో పాటు కరోనా క్రైసిస్ కమిటీ సభ్యులను అభినందించారు. ఇవే కాకుండా అవసరమైన మేర మరిన్ని కిట్లను సరఫరా చేయనున్నట్లు తలసాని కుమారుడు సాయి వెల్లడించారు.
ఇదీ చూడండి... డెలివరీ 'లేడీ'గా మారిన ప్రముఖ పాప్ సింగర్!